Site icon vidhaatha

Panagal temples | పానగల్ ఆలయాల అభివృద్ధి నిధులు దారి మళ్లించవద్దు .. మంత్రి కోమటిరెడ్డికి బీఆరెస్ వినతి

విధాత, హైదరాబాద్ : నల్లగొండ పట్టణానికి తలమానికమైన చారిత్రాక పచ్చల, ఛాయ సోమేశ్వర, వెంకటేశ్వర ఆలయాల అభివృద్ధి, వారసత్వ కట్టడాల పరిరక్షణకు, ఉదయ సముద్రం అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ మంజూరీ చేసిన 139.21కోట్ల నిధులను ఇతర పనులకు మళ్లించవద్దని బీఆరెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్‌, కోఆప్షన్ కమిటీ సభ్యులు, పానగల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కొండూరు సత్యనారాయణలు స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని వినతి పత్రం ద్వారా అభ్యర్థించారు. గతంలో పానగల్ చారిత్రాక ప్రాశస్తిని, ఆలయాల గొప్పతనాన్ని గుర్తించి గత ప్రభుత్వాలు 2001నుంచి 2014లోపు మూడు పర్యాయాలు అధికారికంగా పానగల్ ఉత్సవాలు నిర్వహించాయని గుర్తు చేశారు. పానగల్ పర్యాటక అభివృద్ధి కోసం మంజూరైన నిధులను వాటి అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని కోరారు. అలాగే నల్లగొండ మున్సిపాల్టీ అభివృద్ధికి, రోడ్లు, మురికి కాలువలు, స్మశానవాటికలు తదితర మౌలిక సదుపాయాలకోసం కొత్తగా 250కోట్ల నిధులు మంజూరీ చేయించాలని వారు కోరారు. నల్లగొండ పట్టణంం రింగురోడ్డుకు స్థానిక మంత్రిగా కేంద్రం నుంచి 700కోట్లు మంజూరీ చేయించడం అభినందనీయమని పేర్కోన్నారు.

Exit mobile version