Site icon vidhaatha

Viral: ట్రక్ ఢీకొని పిల్ల ఏనుగు మృతి.. కాపాడేందుకు తల్లి ఎనుగు తండ్లాట !

విధాత: బిడ్డల పట్ల మమకారం.. పిల్లలకు ఏమైనా ఆపద ఎదురైతే తల్లులు పడే వేదన ప్రకృతిలో మనిషికైనా..పశు పక్ష్యాదులు..వన్యప్రాణులకైనా ఒక్కటే. ఇందుకు సృష్టిలోని జంతువులు తమ సంతానాన్ని పోషించేందుకు.. కాపాడుకునేందుకు ఎంతదాకైనా ప్రయత్నిస్తుండటం తెలిసిందే.

అయితే ఓ పిల్ల ఏనుగును కాపాడుకోవడంతో తల్లి ఏనుగు పడిన తపన.. చూసిన వారికి కంటనీరు పెట్టించకమానదు.  మలేషియాలో జరిగిన ఈ దుర్ఘటన ఎందరో హృదయాలను కలిచివేసింది. రోడ్డు దాటుతున్న క్రమంలో పిల్ల ఏనుగును వేగంగా వచ్చిన ట్రక్ ఢీ కొట్టింది. ప్రమాదంలో పిల్ల ఏనుగు కాస్తా ట్రక్ కింద చిక్కుకుని నలిగిపోయింది.

అది చూసిన తల్లి ఏనుగు తీవ్ర ఆవేశం..ఆవేదనతో తన బిడ్డను కాపాడుకోవడం కోసం రాత్రంతా తండ్లాడింది. బిడ్డను రక్షించేందుకు ట్రక్ ను తలతో నెడుతూ తొండంతో కొడుతూ కాలితో తన్నుతూ తల్లి ఏనుగు చెయ్యని ప్రయత్నం అంటూ ఏది లేదు. అయితే ప్రమాదంలో పిల్ల ఏనుగు మృతి చెందడంతో రెస్క్యూ సిబ్బంది కూడా ఏమి చేయలేకపోయారు.

తెల్లవారాక ట్రక్ ను ముందుకు కదిలించాకే తన బిడ్డను చూసుకున్న ఆ తల్లి ఏనుగు విచారంలో మునిగిపోయింది. తన వద్ధకు వచ్చిన సిబ్బందిని కూడా పట్టించుకోకుండా కన్నీటి పర్యంతమైంది. వారు ఏమైనా నా బిడ్డను కాపాడుతారా అన్న ఆశగా చూస్తు ఉండిపోయింది. ఈ ప్రమాదంతో రహదారిపై పెద్ధ ఎత్తున రెండు వైపుల ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానిక ప్రజలు, వాహనదారులు బిడ్డ కోసం తల్లి ఏనుగు పడిన వేదన చేసి చలించిపోయారు.

Exit mobile version