Site icon vidhaatha

Ooty-Kodaikanal | సమ్మర్‌లో ఊటీ.. కొడైకెనాల్‌ వెళ్తున్నారా..? ఈ-పాస్‌ తీసుకోవడం మరవొద్దు..!

Ooty-Kodaikanal | వేసవిలో ఎండలు దేశవ్యాప్తంగా దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో చాలామంది పర్యాటకులు చల్లటి ప్రదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో పర్యాటకులు ఊటీ, కొడైకెనాల్‌కి క్యూ కడుతుంటారు. ఎత్తయిన కొండల కారణంగా మండుటెండల్లోనూ ఇక్కడ చల్లటి వాతావరణం ఉంటుంది. పచ్చిక బయళ్లతో నిండిన సుందరమైన ప్రకృతి దృశ్యాలు ఏటా పర్యాటకులను ఆహ్వానం పలుకుతాయి. ఊటీలో హిల్ స్టేషన్స్‌, తేయాకు తోటలు, సరస్సులున్నాయి. కొడైకెనాల్‌లో సర్సులు, బ్రయంట్‌ పార్క్‌, పిల్లర్‌ రాక్స్‌ పర్యాటక ప్రాంతాలున్నాయి.

సమ్మర్‌లో ఇక్కడికి చాలామంది వస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడి అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. మే 7 నుంచి జూన్‌ 30 వరకు ఊటీ, కొడైకెనాల్‌లో పర్యటనకు వచ్చేవారంతా తప్పనిసరిగా ఈ-పాస్‌ తీసుకోవాలని చెప్పారు. వేసవి హిల్‌ స్టేషన్‌కు వచ్చే పర్యాటకుల డేటాను సేకరించాలనే కొత్త రూల్‌ని తీసుకువచ్చారు. ఇటీవల ప్రత్యేక డివిజన్‌ బెంచ్‌ నీలగిరి, దండిగల్‌ కలెక్టర్లకు పర్యాటలకు ఈ పాస్‌లు జారీ చేయాలని ఆదేశించింది. అయితే, ఈ-పాస్‌ల సంఖ్య విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవు. ఎన్నిక పాస్‌లు జారీ చేయాలనేది రెండు జిల్లాల కలెక్టర్ల పరిధిలో ఉంటుంది.

స్థానికులకు మాత్రం పాస్‌లు అవసరం లేదని కోర్టు పేర్కొంది. గతంలో పర్యాటకుల సంఖ్యను నియంత్రించాలని కోర్టు నిర్ణయించింది. దాంతో వాహనాల రాకపోకలను ఆపాలని నీలగిరి, దిండిగల్ కలెక్టర్లకు సూచించింది. రద్దీ సీజన్లలో వాహనాల సంఖ్య సుమారు 2వేల నుంచి 20వేలకు పెరుగుతుంది. దాంతో ట్రాఫిక్‌ కారణంగా పర్యావరణానికి హాని కలుగుతుంది. ఈ విషయాన్ని గమనించిన ప్రత్యేక కోర్టు వేసవిలో రద్దీ కారనంగా రహదారులపై ఒత్తిడి, పర్యావరణానికి హాని కలుగుతుందని గుర్తించిన కోర్టు.. ఈ సమస్యను పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని చెప్పింది.

Exit mobile version