Monkey’s Antics: ఎవరికైనా ఇష్టమైనది లభిస్తే..దాన్ని కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లుగా చెబుతుంటారు. కోతులకు ఆహార పదార్ధాలు మినహా మరేమి దొరికిన వాటిని ఏం చేసుకోవాలో తెలియక వాటిని ధ్వంసం చేయడం..విసిరేయడం చూస్తుంటాం. ఓ కోతి టూరిస్టు నుంచి కరెన్సీ నోట్ల కట్టల సంచి తీసుకెళ్లి దాన్ని తెరిచి చేసిన వింత చేష్టలకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రముఖ పర్యాటక ప్రాంతం కొడైకెనాల్ లో ఓ కోతి వింత చేష్టలతో పర్యాటకులు తిప్పలు పడ్డారు. తినుబండారాలు ఉన్నాయనుకుని ఓ పర్యాటకుడి నుంచి కోతి అకస్మాత్తుగా బ్యాగ్ ఎత్తుకెళ్లింది. ఎత్తుకెళ్లిన బ్యాగ్ తో చెట్టుపై కూర్చొంది. ఆ బ్యాగ్ ఓపెన్ చేసిన కోతికి అందులో తినుబండరాలు కనిపించలేదు. అయితే బ్యాగ్ లో ఉన్న రూ.500 నోట్ల కట్టను తీసిన కోతి..ఆ నోట్లను వేరు చేసి తినడానికి పనికి రావనుకుని చెట్టుపై నుంచి చెల్లాచెదురుగా విసిరేసింది. ఇదంతా గమనించిన టూరిస్టులు..అందుకే కాబోలు కోతి చేష్టలు అన్నారనుకున్నారు.
ఇక బాధిత టూరిస్టు అయితే తన బ్యాగ్ లో నుంచి కోతి విసిరేసిన నోట్లను ఏరుకునేందుకు నాన తంటాలు పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు ఆ తిక్క కోతికి తెలిసి ఉంటే.. ఆ నోట్లతో ఎన్నో తిను బండారాలు కొనుక్కునేదంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
कोडैकनाल के गुना केव्स के पास एक बंदर ने कर्नाटक से आए पर्यटकों से 500 रुपये के नोटों की गड्डी छीनी और पेड़ पर चढ़कर नोटों को एक-एक कर नीचे फेंक दिया. यह अनोखा वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है.#Monkey #ViralVideo #Kodaikanal #Karnataka #ATReel #AajTakSocial pic.twitter.com/1q72IbK8xa
— AajTak (@aajtak) June 16, 2025