Beggar Woman | యాచ‌కురాలి సంచిలో భారీగా నోట్ల క‌ట్ట‌లు.. 17 కిలోల చిల్ల‌ర నాణేలు

Beggar Woman | యాచ‌కుల( Beggars ) వ‌ద్ద భారీగా డ‌బ్బు( Money ) ఉంటుంద‌ని ఎవ‌రూ ఊహించ‌రు. కానీ కొంత‌మంది యాచ‌కులు భిక్షాట‌న చేసి కోట్ల రూపాయాలు సంపాదించిన ఘ‌ట‌న‌లు చూశాం. ఇంకొంద‌రు ల‌క్ష‌ల్లో సంపాదించిన ఘ‌ట‌న‌లు చూశాం. ఆ మాదిరిగానే ఓ యాచ‌కురాలి( Beggar Woman ) సంచుల‌ను త‌నిఖీ చేయ‌గా భారీగా నోట్ల క‌ట్ట‌లు, 17 కిలోల వ‌ర‌కు చిల్ల‌ర నాణేలు ల‌భ్య‌మ‌య్యాయి.

  • By: raj |    national |    Published on : Oct 27, 2025 8:25 AM IST
Beggar Woman | యాచ‌కురాలి సంచిలో భారీగా నోట్ల క‌ట్ట‌లు.. 17 కిలోల చిల్ల‌ర నాణేలు

Beggar Woman | డెహ్రాడూన్ : ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఓ యాచ‌కురాలి( Beggar Woman ) సంచిలో భారీగా నోట్ల క‌ట్ట‌లు( Currency Notes ) బ‌య‌ట‌ప‌డ్డాయి. నోట్ల క‌ట్ట‌ల‌తో పాటు చిల్లర నాణేలు కూడా కిలోల కొద్ది ల‌భించాయి. ఆ యాచ‌కురాలి వ‌ద్ద ఉన్న ల‌క్ష‌ల రూపాయాల న‌గ‌దును చూసి స్థానికులు షాక్ అయ్యారు.

ఉత్త‌రాఖండ్( Uttarakhand ) హ‌రిద్వార్ జిల్లాలోని మంగ‌లౌర్ ప‌ట్ట‌ణంలోని ప‌ఠాన్‌పురా( Pathanpura ) ఏరియాలో గ‌త కొన్నేండ్ల ఓ యాచ‌కురాలు భిక్షాట‌న చేస్తోంది. అయితే ఆమెను అక్క‌డ్నుంచి పంపించేందుకు స్థానికులు య‌త్నించారు. ఈ క్ర‌మంలో ఆమె వ‌ద్ద ఉన్న రెండు ప్లాస్టిక్ బ్యాగుల‌ను స్థానికులు త‌నిఖీ చేశారు.

యాచ‌కురాలి బ్యాగుల్లో ఉన్న న‌గ‌దును చూసి స్థానికులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. కుప్ప‌లు కుప్ప‌లుగా నోట్ల క‌ట్ట‌లు( Currency Notes ) బ‌య‌ట‌ప‌డ్డాయి. 17 కిలోల వ‌ర‌కు చిల్లర నాణేలు ల‌భ్య‌మ‌య్యాయి. నాలుగైదు రూ. 500 నోట్ల‌తో పాటు రూ. 20, రూ. 10 నోట్లు ఉన్నాయి. ఈ నోట్ల‌ను లెక్క‌పెట్టేందుకు దాదాపు 2 గంటల స‌మ‌యం ప‌ట్టింది. నోట్ల‌ను లెక్క‌పెట్టగా రూ. 53,186 న‌గ‌దు ఉన్న‌ట్లు తేలింది. 17 కిలోల చిల్ల‌ర నాణేల‌ను లెక్క పెట్టేందుకు సాయంత్రం అయింది. నోట్లు, చిల్ల‌ర నాణేలు క‌లిపితే రూ. ల‌క్ష వ‌ర‌కు ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు. యాచ‌కురాలిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.