Special Trains |
విధాత: వేసవి సెలవుల నేపథ్యంలో నెలకొనే రద్దీకి అనుగుణంగా ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు 38 వేసవి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. చర్లపల్లి, శ్రీకాకుళం, మచిలీపట్నం, తిరుపతి సహా మరిన్నింటిని కలుపుతూ 38 వేసవి ప్రత్యేక రైళ్లను నడుపనుంది.
ఏప్రిల్ 11 నుండి జూన్ 30 వరకు వేసవి ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ప్రతి రూట్‌కు వారపు షెడ్యూల్‌లు , బహుళ సర్వీసులను నడపనున్నారు. ఈ రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు ఉంటాయని రైల్వే శాఖ తెలిపింది.
చర్లపల్లి ↔ శ్రీకాకుళం మధ్య నడిచే వేసవి ప్రత్యేక రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడెపల్లి గూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతాయి.
అలాగే తిరుపతి ↔ మచిలీపట్నం మార్గంలో రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తేనాలి, విజయవాడ, గుడివాడ, పెడన స్టేషన్ల మధ్య ఆగనున్నాయి.
వేసవి ప్రత్యేక రైళ్లు నడిచే మార్గాలు :
చర్లపల్లి ↔ శ్రీకాకుళం (12 సర్వీసులు)
శ్రీకాకుళం ↔ చర్లపల్లి (12 సర్వీసులు)
తిరుపతి ↔ మచిలీపట్నం (7 సర్వీసులు)
మచిలీపట్నం ↔ తిరుపతి( 7సర్వీసులు)
పొడగించిన ప్రత్యేక రైళ్లు
తిరుపతి–షిర్డీ, కాజీపేట–దాదర్, ఛప్రా–జల్నాల మధ్య రెండు వైపుల నడిచే ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించారు.