AP bird flu| ఏపీలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం..28వేల కోళ్ల మృతి

గత ఏడాది తెలుగు రాష్ట్రాల ఫౌల్ట్రీ ఫామ్ రైతులను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన బర్డ్ ఫ్లూ మరోసారి విస్తరిస్తుంది. ఏపీలోని చిత్తూరు అన్నమయ్య జిల్లా పరిధిలోని సదుం మండలంలో బర్డ్ ఫ్లూ వైరస్ పంజా విసిరింది. మండల పరిధిలోని పుట్టవాండ్లపల్లె, కంభంవారిపల్లె, అమ్మగారిపల్లె గ్రామాల్లోని ఫౌల్ట్రీ ఫామ్ లలో దాదాపు 28 వేల కోళ్లు మృతి చెందాయి.

అమరావతి : గత ఏడాది తెలుగు రాష్ట్రాల ఫౌల్ట్రీ ఫామ్ రైతులను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన బర్డ్ ఫ్లూ మరోసారి విస్తరిస్తుంది. ఏపీలోని చిత్తూరు అన్నమయ్య జిల్లా పరిధిలోని సదుం మండలంలో బర్డ్ ఫ్లూ వైరస్ పంజా విసిరింది. మండల పరిధిలోని పుట్టవాండ్లపల్లె, కంభంవారిపల్లె, అమ్మగారిపల్లె గ్రామాల్లోని ఫౌల్ట్రీ ఫామ్ లలో దాదాపు 28 వేల కోళ్లు మృతి చెందాయి. మృతి చెందిన కోళ్ల శాంపిల్స్ ను మధ్యప్రదేశ్‌లోని భోపాల్  హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌కు పంపించగా.. బర్డ్ ఫ్లూ వ్యాధిగా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు మూడు కోళ్ల ఫారాలను సీజ్ చేశారు.

బర్డ్ ఫ్లూ విస్తరిస్తుండటంతో జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అధికారులు మృతి చెందిన కోళ్లను జేసీబీలతో గొయ్యి తీయించి పూడ్చేశారు. వ్యాధికి గురైన కోళ్లను, కోడిగుడ్లను అమ్మరాదని అధికారులు ఫౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులను, వ్యాపారులను ఆదేశించారు. ఫౌల్ట్రీ ఫామ్ లలో బర్డ్ ఫ్లూ విస్తరించకుండా బయో సెక్యూరిటీ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. . బర్డ్ ఫ్లూ వల్ల నష్టపోయిన కోళ్ల ఫారాల రైతులకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు.

బర్డ్ ఫ్లూతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. కోళ్ల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువ అని తెలిపారు. 100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి మీద ఉడికించిన మాంసంలో వైరస్ ఉండదని.. బాగా ఉడికించిన మాంసాన్ని తీసుకోవాలని సూచించారు. అయితే వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం కనీసం 10 రోజుల పాటు కోడిమాంసం, గుడ్ల తినకపోవడం మంచిదని నిపుణులు వెల్లడిస్తున్నారు.

Latest News