Viral Video | “జాన్ జాయే పర్ దారూ న జాయే!” — ఇప్పుడు ఈ డైలాగ్ ఓ వీడియోతో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. మద్యం కోసం ఆత్రంగా ఓ వ్యక్తి చేసిన వినూత్న ప్రయత్నం సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. మద్యం తాగే ఆశతో ఇనుప గ్రిల్ అడ్డంగా ఉన్న షాపులో నుండి బాటిల్ తీసేందుకు ప్రయత్నించిన యువకుడు, తల గ్రిల్‌లో ఇరుక్కుని నవ్వులు పుట్టిస్తున్నాడు.
పూర్తి వివరాల ప్రకారం, మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఓ మద్యం షాపు కౌంటర్‌లోంచి బాటిల్ దొంగతనంగా తీసేందుకు ప్రయత్నించాడు. చేతికి అందడం లేదు. ఇంకాస్తా ముందుకెళ్తే పనైపోతుందనుకుని, తలకాయను గ్రిల్ లోపలికి నెట్టాడు. మొత్తానికి బాటిల్ అందుకున్నాడు గానీ, వెనక్కివద్దామనుకుంటే ఆ వెధవాయ్ తలకాయ్ గ్రిల్‌లో నుండి రావడంలేదు. అటు తల బయటపడకుండా ఇరుక్కుపోయిన పరిస్థితి.. ఇటు చేతుల్లో బాటిల్ పట్టుకొని విడిచిపెట్టలేని పరిస్థితిని చూసిన వారు నవ్వాపుకోలేకపోయారు.
ఈ వీడియోలో, అతడిని రక్షించేందుకు చుట్టూ ఉన్న వారు ప్రయత్నించినా — అతను బాటిల్‌ను మాత్రం వదలకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వీడి ఆత్రం తగలెయ్య అనుకుని, కొన్ని నిమిషాల పాటు తీవ్రంగా ప్రయత్నించిన తరువాతే అతన్ని విడుదల చేయగలిగారు. మీరూ ఈ వీడియో చూసి నవ్వుకోండి..!
इस चक्कर में सब चकरा गए
😝😝😂😂🤣🤣 pic.twitter.com/bR1HeomdU7— मनप्रीत कौर❤मन💕 (@mannkaurr1) July 8, 2025
ఈ వీడియోకు సోషల్ మీడియాలో అనేక మంది స్పందించారు. “Apex level of Darubaj ” అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, ఇంకొకరు “బాటిల్ కోసం ప్రాణం కూడా ఇస్తాడు” అంటూ హాస్యంగా స్పందించారు.