Crocodile attack| షాకింగ్..తృటిలో మొసలి చేతిలో చావు తప్పింది!

నీటిలోకి వెళ్లినప్పుడు మనుషులు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఓ వ్యక్తి ప్రశాంతంగా పడవ నుంచి చేపలు పడుతుండగా.. అనూహ్యంగా నీటి లోపల నుంచి ఓ మొసలి హఠాత్తుగా అతని చేతిలోని చేపను లాక్కెళ్ళిపోతుంది. ఈ ఘటనలో అతని చేతి మొసలికి చిక్కి ఉంటే చేపతో పాటు అతను కూడా ఆ మొసలికి ఆహారంగా మారిపోయేవాడే..ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

విధాత: నీటిలోకి వెళ్లినప్పుడు మనుషులు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఓ వ్యక్తి ప్రశాంతంగా పడవ(fishing boat incident)నుంచి చేపలు పడుతుండగా.. అనూహ్యంగా నీటి లోపల నుంచి ఓ మొసలి( Crocodile attack) హఠాత్తుగా అతని చేతిలోని చేపను లాక్కెళ్ళిపోతుంది. అదృష్టవశాత్తు అతని చేయి ఆ మొసలికి చిక్కలేదు. చిక్కి ఉంటే చేపతో పాటు అతను కూడా ఆ మొసలికి ఆహారంగా( Near death escape) మారిపోయేవాడే. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ఇంటర్నేట్ లో వైరల్ మారింది.

వైరల్ వీడియో ప్రకారం.. అమెరికాలోని ఫ్లోరిడా జలాల్లో ఒక పడవలో ఓ జాలరి తన హుక్డ్ చేపను పట్టుకోవడానికి వంగి చూస్తున్నాడు. తన గాలానికి చిక్కిన చేపను చేతితో పట్టుకుంటున్న సమయంలోనే మొసలి(అమెరికన్ ఎలిగేటర్) అకస్మాత్తుగా నీటిలోంచి దూసుకొచ్చి పైకి దూకి చేపను లాక్కుంది. అంతే వేగంగా నీటిలోకి వెళ్లిపోయింది. ఈ ఆకస్మిక ఘటనతో ఆ వ్యక్తి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. కొద్దిలో తన చావు తప్పిందనుకుంటూ మొసలి చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొసలి నోటికి చేపతో పాటు తన చేయి చిక్కి ఉంటే నీటిలో మొసలికి ఆహారంగా మారిపోయేవాడనని..ఈ రోజు చావు తప్పిందని భయపడిపోయాడు.

ఈ షాకింట్ వీడియోను..‘అమేజింగ్ నేచర్’ అనే ట్విట్టర్ అకౌంట్ ఇంటర్నెట్‌లో షేర్ చేసింది. ఈ 37 సెకన్ల వీడియోకు మూడు లక్షలకు పైగా వ్యూస్ రాగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘తృటిలో తప్పిపోయింది. అసలేం జరిగి ఉండేదో.. ఎవ్వరం చెప్పలేం’ అని ఒకరు కామెంట్ చేయగా.. చేపలు పట్టేటప్పుడు మొసలితో చాలా జాగ్రత్తగా ఉండాలని..ఆ వ్యక్తికి భూమి మీద నూకలుండటంతో బతికిపోయాడని మరికొందరు కామెంట్లు పెట్టారు.

 

Latest News