Total Lunar Eclipse 2025 | సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం – ‘అరుణ చంద్రుడి’ కనువిందు

సెప్టెంబర్ 7 రాత్రి ఆకాశం వైపు చూడటమే చాలు. చంద్రుడు రక్తవర్ణ కాంతిలో మెరిసిపోతూ అందరికీ అరుదైన అనుభూతిని అందించబోతున్నాడు. ఈ అనుభవాన్ని వదులుకోకండి.

హైదరాబాద్‌:

Total Lunar Eclipse 2025 | వినువీధిని వీక్షించే వారికోసమే ప్రత్యేకంగా కనువిందు చేయనున్న అంతరిక్ష అద్భుతం  ఈ నెల సెప్టెంబర్ 7 రాత్రి నుండి 8వ తేదీ తెల్లవారుజామున వరకూ సంపూర్ణ చంద్రగ్రహణం (Total Lunar Eclipse)గా జరగనుంది. చంద్రుడు భూమి నీడలోకి ప్రవేశించే ఈ సందర్భంలో, చంద్రుడి రూపం ఎరుపు-నారింజ రంగులో మెరిసిపోతూ “రక్త చంద్రుడి”గా ఆకాశాన్ని అలరిస్తాడు. మొత్తం 82 నిమిషాలపాటు సంపూర్ణ దశ కొనసాగనుండటంతో ఇది ఈ దశాబ్దంలో అత్యంత వైభవమైన చంద్రగ్రహణంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

భారతదేశం సహా ఆసియా ఖండం, ఆస్ట్రేలియా పశ్చిమ భాగం, యూరప్, ఆఫ్రికా దేశాల్లో ఈ గ్రహణం స్పష్టంగా కనిపించనుంది. భారత్‌లో అయితే ఉత్తరం నుంచి దక్షిణం వరకూ, తూర్పు నుంచి పడమర దాకా దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలు దీన్ని వీక్షించే అవకాశం ఉంది. ఢిల్లీ, లక్నో, జైపూర్, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి మెట్రోపాలిటన్ నగరాలతో పాటు, చిన్న పట్టణాల్లోనూ ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది.

📅 చంద్రగ్రహణం సమయాలు

‘అరుణ చంద్రుడు’ అంటే ఏమిటి?

రక్త చంద్రుడు లేదా అరుణ చంద్రుడు అనేది సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో కనిపించే ఒక ప్రత్యేక దృశ్యం. సాధారణంగా చంద్రుడు తెల్లటి వెండివెలుగు ప్రసరిస్తాడు. కానీ చంద్రగ్రహణ సమయంలో భూమి,  సూర్యచంద్రుల మధ్యలోకి వచ్చేస్తుంది. దీంతో చంద్రుడిపై నేరుగా సూర్యకాంతి పడదు.

అయినా చంద్రుడు పూర్తిగా కనుమరుగైపోడు. ఎందుకంటే సూర్యకాంతి భూమి వాతావరణం గుండా వంగి చంద్రుడిపై పడుతుంది. ఈ సమయంలో:

దీని ఫలితంగా చంద్రుడు ఎరుపు లేదా నారింజ వర్ణంలో మెరిసిపోతాడు. దీనినే ప్రజలు “రక్త చంద్రుడు” గా పిలుస్తారు.

చూడాలనుకునేవారికి సూచనలు: (అందరూ తప్పకుండా చూడండి)

ఖగోళ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ఇది ఈ దశాబ్దంలోనే అత్యంత ఆకర్షణీయమైన చంద్రగ్రహణాలలో ఒకటి. ప్రపంచ జనాభాలో దాదాపు 85 శాతం మంది ఈ గ్రహణాన్ని కనీసం కొంత భాగాన్నైనా ప్రత్యక్షంగా వీక్షించగలుగుతారు.