Lunar Eclipse | భాద్రపద పౌర్ణమి ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం( Lunar Eclipse )ఏర్పడనుంది. ఈ చంద్ర గ్రహణం పితృపక్షం( Pitru Paksha ) లో ఏర్పడుతుండడంతో అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. 100 ఏండ్ల తర్వాత పితృపక్షంలో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుండడంతో.. కొన్ని రాశుల వారికి అష్టైశ్వరాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి చంద్ర గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది..? ఆ ఐదు రాశులు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
చంద్ర గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందంటే..?
ఆదివారం(సెప్టెంబర్ 7) రాత్రి 9.58 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1.26 గంటలకు ముగుస్తుంది. రాత్రి 11.42 గంటల సమయంలో చంద్రుడు అసలు కనబడడు. అర్ధరాత్రి 12.24 గంటలకు గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ గ్రహణం మొత్తం వ్యవధి దాదాపు మూడున్నర గంటలు. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్ర గ్రహణం.
ఏయే రాశులకు పట్టిందల్లా బంగారం కానుందంటే..?
మేష రాశి( Aries )
పితృపక్షంలో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుండడంతో.. మేష రాశి వారికి అనేక శుభాలు కలగనున్నాయి. ముఖ్యంగా వ్యాపారులు ఆశించిన లాభాలు పొందుతారు. లాభం ఒక్కటే కాదు.. కొత్త అవకాశాలను కూడా పొందుతారు. వివిధ వనరుల నుంచి డబ్బును సంపాదించే మార్గాలు మీ వద్దకు వస్తాయి. డబ్బును కూడా ఆదా చేసుకుంటారు. మీడియా, కమ్యూనికేషన్, ప్రచురణ మొదలైన వాటికి సంబంధించిన వ్యక్తులు అదనపు ప్రయోజనాలను పొందేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుటుంబంలోని తోబుట్టువుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది. జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది.
మిథున రాశి( Gemini )
ఊహించని విధంగా మిథున రాశి వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. విదేశీ సంబంధాల కారణంగా ఊహించని విధంగా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు. విపరీతమైన లాభాలను ఆర్జిస్తారు. ఈ క్రమంలో మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. దీంతో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఈ రాశివారి వ్యక్తిత్వం కూడా పది మంది మెచ్చుకునేలా మెరుగుపడుతుంది. ఇతరులు మీ మాట విని అర్థం చేసుకునే స్థాయికి ఎదుగుతాం. రాజకీయాలు, సామాజిక సేవకు సంబంధించిన వ్యక్తులు గౌరవం పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.
తులా రాశి( Libra )
పితృపక్షంలో చంద్ర గ్రహణం కారణంగా ఊహించిన దాని కంటే తులా రాశి వారికి మంచి జరగనుంది. అనేక శుభాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగం కావాల్సిన వారికి ఉద్యోగం భిస్తుంది. దీంతో ఉత్సాహం పెరిగి.. ఇంకా అభివృద్ధి చెందేందుకు ప్రయత్నిస్తారు. ఈ కష్టం.. మీ విజయ అవకాశాలకు బాటలు వేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అయితే కోరుకున్న చోటకు బదిలీ అవుతుంది. ప్రియమైన వారు దగ్గరవుతారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే తప్పకుండా సఫలీకృతులవుతారు. మీకు స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది.
ధనుస్సు రాశి( Sagittarius )
ఈ చంద్ర గ్రహణం ధనుస్సు రాశి వారికి ఆనందం, విజయాన్ని తెస్తుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. అప్పుల నుంచి విముక్తి పొందుతారు. డబ్బు సంపాదించేందుకు కొత్త మార్గాలు మీ ముంగిట వాలిపోతాయి. కుటుంబంలో సహాయ సహకారాలు చేసుకుంటూ విజయం వైపు అడుగులేస్తారు. పని చేసే ప్రదేశంలో కూడా సహోద్యోగుల నుంచి సహయసహకారాలు లభిస్తాయి. దీంతో పెండింగ్‌లో ఉన్న వరకు చాలా వరకు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా ఉన్న మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. పని కూడా మెరుగుపడుతుంది.
మీన రాశి( Pisces )
పితృపక్షంలో చంద్ర గ్రహణం కారణంగా మీన రాశి వారికి ఎంతో శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఆర్థికంగా స్థిరత్వం పొందేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి. సొంతంగా కూడా వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. కంటెంట్ రైటింగ్, ప్రకటనలు, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులు ఈ కాలంలో తమ ప్రతిభను చూపించే అవకాశం పొందవచ్చు. పాత పరిచయాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆగిపోయిన డబ్బును పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో మీరు మీ తల్లి నుండి ప్రేమ, మద్దతు పొందుతారు.