Lunar Eclipse | మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు యాదాద్రి ఆల‌యం మూసివేత‌

Lunar Eclipse | ఇవాళ రాత్రికి సంపూర్ణ చంద్ర గ్ర‌హ‌ణం( Lunar Eclipse )కార‌ణంగా.. యాదాద్రి ఆల‌యాన్ని( Yadadri Temple ) మూసివేయ‌నున్నారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి భ‌క్తుల( Devotees ) ద‌ర్శ‌నాలు నిలిపివేయ‌నున్నారు.

Lunar Eclipse | హైద‌రాబాద్ : సంపూర్ణ చంద్రగ్రహణం( Lunar Eclipse ) సందర్భంగా యాదగిరిగుట్ట( Yadagirigutta ) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఆదివారం మూసివేయ‌బ‌డ‌నుంది. నిత్య కైంకర్యాలు అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు యాదాద్రి ఆల‌యాన్ని( Yadadri Temple ) మూసివేస్తున్న‌ట్లు ఆల‌య అర్చ‌కులు తెలిపారు. ఈ క్ర‌మంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శనాలు నిలిపివేయ‌నున్నారు. తిరిగి సోమ‌వారం తెల్ల‌వారుజామున‌ 3.30కు ఆల‌యం త‌ల‌పులు తెరుచుకోనున్నాయి. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం ద‌ర్శ‌నాలు పునఃప్రారంభం కానున్నాయి.

చంద్ర గ్ర‌హ‌ణం ఎప్పుడు ఏర్ప‌డుతుందంటే..?

ఆదివారం రాత్రి 9.58 గంట‌ల‌కు చంద్ర‌గ్ర‌హ‌ణం ప్రారంభం కానుంది. సెప్టెంబ‌ర్ 8వ తేదీ సోమ‌వారం తెల్ల‌వారుజామున 1.26 గంట‌ల‌కు చంద్ర‌గ్ర‌హ‌ణం ముగియ‌నుంది. రాత్రి 11.42 గంట‌ల స‌మ‌యంలో చంద్రుడు అస‌లు క‌న‌బ‌డ‌డు. అర్ధ‌రాత్రి 12.24 గంట‌ల‌కు గ్ర‌హ‌ణ ప్ర‌భావం అధికంగా ఉంటుంది. ఈ గ్ర‌హ‌ణం మొత్తం వ్య‌వ‌ధి దాదాపు మూడున్న‌ర గంట‌లు. కాగా ఈ ఏడాదిలో ఇదే చివ‌రి చంద్ర గ్ర‌హ‌ణం.

Latest News