Site icon vidhaatha

శ్రీవారిని దర్శించుకున్న కాకతీయ వంశంలోని 22వ తరం వారసుడు

విధాత: కాకతీయ వంశంలో 22వ తరం వారసుడైన కమల్‌చంద్ర భంజ్‌దేవ్ నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి తీర్థప్రసాదాలు అందించారు. ప్రస్తుత కష్టకాలం నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని స్వామి వారిని వేడుకున్నట్టు కమల్‌చంద్ర తెలిపారు.

Exit mobile version