విధాత: దేశం లోని అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేసే పనిలో కేంద్రం బిజీగా ఉంది.రోడ్ల నుండి రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఓడ రేవులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, బొగ్గు గనులు, చివరికి BSNL టవర్లు, కరెంటు వైర్లు కూడా వదలకుండా అంగట్లో అమ్మకానికి పెట్టారు మన దేశ పాలకులు.తాజాగా కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన ఈ ప్రభుత్వ ఆస్తులు చూస్తే ఎవరికైనా కళ్ళు తిరగడం ఖాయం.
- 26,700 కిలోమీటర్ల జాతీయ రహదారులు
- 400 రైల్వే స్టేషన్లు, 150 రైళ్లు, రైల్వే ట్రాక్
- 42,300 కిలోమీటర్ల విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్
- 5,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల హైడ్రో, సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు
- 8,000 కిలోమీటర్ల సహజ వాయువు పైప్ లైన్
- 4,000 కిలోమీటర్ల HPCL, BPCL పైప్ లైన్లు.
- 2.86 లక్షల కిలోమీటర్ల భారత్ నెట్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్, BSNL, MTNL టవర్లు
- 160 బొగ్గు గనులు
- 761 మైనింగ్ బ్లాకులు
- 25 విమానాశ్రయాలు
- తొమ్మిది ఓడ రేవుల్లో 31 ప్రాజెక్టులు
- రెండు జాతీయ స్టేడియంలు