Site icon vidhaatha

Kamareddy | దళిత బాలికపై.. BRS నేత అత్యాచారం

విధాత‌: కామారెడ్డి (Kamareddy) జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోగల గండిమాసాని పేట్ గ్రామంలో అఘాయిత్యం జరిగింది. మైనర్ బాలికపై బీఆర్ఎస్ నాయకుడు హత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కామారెడ్డి శివారులో ఇటుకల బట్టి నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు జగన్ గౌడ్,
తన ఇటుక బట్టిలోనే పనికి వచ్చిన బాలికను బలవంతంగా ఇటుక బట్టి వెనకాల కుచ్చపై తీసుకెళ్లి హత్యాచారానికి పాల్పడ్డాడు,

నిందితుడు బీఆర్ఎస్ నాయకుడు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పని చేశారు. బాలిక కుటుంబానికి కేసు వాపసు తీసుకోవాలని స్థానిక నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఆలస్యంగా పోలీసులు నిందితుడు జగన్ గౌడ్ (35) పై ఫోక్సో , ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు.

Exit mobile version