CDC Chairman Irshaduddin : సీఎంఆర్ఎఫ్ చెక్కు చించేసి..పార్టీకి కాంగ్రెస్ సీడీసీ చైర్మన్ రాజీనామా.!

చికిత్సకు భారీ ఖర్చు అయినా సీఎంఆర్ఎఫ్‌లో కేవలం రూ.60వేలు మాత్రమే మంజూరుకావడంతో ఆగ్రహించిన సీడీసీ చైర్మన్ ఇర్షాదుద్దీన్ చెక్కు చించి పదవికి రాజీనామా చేశారు.

CDC Chairman Irshaduddin

విధాత, హైదరాబాద్: త‌న చెల్లెలు చికిత్స‌కు రూ.32 ల‌క్ష‌ల ఖ‌ర్చు చేస్తే కేవ‌లం రూ.60 వేలు ఇచ్చార‌ని కామారెడ్డి జిల్లా సీడీసీ చైర్మ‌న్‌ ఇర్షాదుద్దీన్ ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. సీఎంఆర్ఎఫ్‌ చెక్కును చించివేసి తన పదవికి రాజీనామా చేసిన‌ట్లు ప్ర‌కటించారు. ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. తన పరిస్థితి ఇలా ఉంటే…పేదల పరిస్థితి ఏమిటోనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రూ.9లక్షలతో సీఎంఆర్ఎఫ్ కోసం ఆర్జీ పెడితే రూ.60వేలు మంజూరుకావడం దారుణమన్నారు.

మరో 10లక్షలతో పెట్టిన సీఎంఆర్ఎఫ్ ఫైల్ గడువు ముగిసిపోయిందని..వైద్యం కోసం చేసిన అప్పుల ఎలా తీర్చాలో అర్ధం కావడం లేదని వాపోయారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, ఎన్నో కేసుల పాలయ్యానని గుర్తు చేసుకున్నారు. చివరకు ప్రభుత్వం నుంచి నాకు దక్కిన న్యాయం ఇది అంటూ సీఎంఆర్ఎఫ్ చెల్లింపుల విధానంపై తన అసహనం వ్యక్తం చేశారు.