Site icon vidhaatha

ఫ్లాష్‌: త్వరలో దేశంలో కరవు కాటకాలు!

విధాత,న్యూయార్క్‌:వాతావరణ మార్పులకు సంబంధించిన 2021 నివేదికను ఐక్యరాజ్య సమితి విడుదల చేసింది. త్వరలో భారత్‌ సహా ఉపఖండంలో వడగాలుల తీవ్రత పెరగనుందని నివేదికలో వెల్లడించింది.దీంతో భారత్‌ సహా ఉపఖండంలో కరవు కాటకాలు సంభవిస్తాయని ఐరాస హెచ్చరించింది. భారత్‌లో తుపానుల సంఖ్య కూడా పెరుగుతుందని పేర్కొంది.అతివృష్టితో అనేక ప్రాంతాలు అతలాకుతలం అవుతాయని ఈ నివేదికలో వివరించింంది. ఈ శతాబ్దం చివరకు భూతాపం 2 డిగ్రీలు పెరిగే ప్రమాదం ఉందని.. దేశాధినేతలు మేలుకోకపోతే మానవాళికి పెనుముప్పు తప్పదని ఐరాస పేర్కొంది.

Exit mobile version