Site icon vidhaatha

శ్రీవారి దర్శనం కోసం వచ్చిన సందేశాలు గందరగోళానికి దారితీశాయి

విధాత‌:తిరుమల శ్రీవారి దర్శనం కోసం తితిదే ఛైర్మన్‌ కార్యాలయం నుంచి వచ్చిన సంక్షిప్త సందేశాలు గందరగోళానికి దారితీశాయి వై.వి.సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి గడువు ఈనెల 21న ముగిసింది అయితే ఈనెల 26వరకు శ్రీవారి దర్శనానికి సంబంధించి తితిదే ఛైర్మన్‌ కార్యాలయం నుంచి భక్తులకు మెసేజ్‌లు వెళ్లాయి సందేశాల ఆధారంగా తిరుమల చేరుకున్న భక్తులకు కొత్త సమస్య ఎదురైంది.పాలకమండలి పదవీకాలం పూర్తయినందున తితిదే సిబ్బంది టికెట్ల కేటాయింపును నిలిపివేశారు…తమ చరవాణికి సమాచారం రావడం వల్లే వచ్చామన్న భక్తులు..టికెట్లు కేటాయించకపోవడంపై సిబ్బందితో వాగ్వాదానికి దిగారు ఈక్రమంలో జోక్యం చేసుకున్న అదనపు ఈవో ధర్మారెడ్డి భక్తులకు టికెట్లు కేటాయించాలని ఆదేశించడంతో వివాదం సద్దుమణిగింది.

Exit mobile version