ఏపీ దేవాలయ చైర్మన్ల ఎంపిక పూర్తి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు చైర్మన్లను కూటమి ప్రభుత్వం ఎంపిక చేసినట్టు తెలిసింది. దీంతో పాటు టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు ప్రెసిడెంట్ల నియామకం కూడా పూర్తయిందంటున్నారు.

  • Publish Date - September 18, 2025 / 09:10 PM IST

అమరావతి, సెప్టెంబర్ 18 (విధాత): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు చైర్మన్లను కూటమి ప్రభుత్వం ఎంపిక చేసినట్టు తెలిసింది. దీంతో పాటు టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు ప్రెసిడెంట్ల నియామకం కూడా పూర్తయిందంటున్నారు. పార్టీ వర్గాల ద్వారా అందిన అనధికారిక సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్‌గా పోతుగుంట రమేశ్ నాయుడు, శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం, శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా చైర్మన్‌ కొట్టె సాయి ప్రసాద్, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చైర్మన్‌ వి. సురేంద్ర బాబు (మణి నాయుడు), శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, ఇంద్రకీలాద్రి చైర్మన్‌గా బొర్రా రాధాకృష్ణ (గాంధీ), శ్రీ వెంకటేశ్వర ఆలయం, వాడపల్లి చైర్మన్‌గా ముదునూరి వెంకట్రాజు పేర్లు దాదాపు ఖరారు అయ్యాయని తెలుస్తున్నది. అదే విధంగా టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్ ప్రెసిడెంట్ గా ఏ.వి. రెడ్డి, టీటీడీ హిమాయత్‌నగర్ ప్రెసిడెంట్ నేమూరి శంకర్ గౌడ్, బెంగళూరు ప్రెసిడెంట్ వీరాంజనేయులు, ఢిల్లీ ప్రెసిడెంట్ ఎదుగుండ్ల సుమంత్ రెడ్డి, ముంబై ప్రెసిడెంట్ ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానియా, టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, విశాఖపట్నం ప్రెసిడెంట్ గా వెంకట పట్టాభిరామ్ చోడే ను ఎంపిక చేశారని సమాచారం.