Site icon vidhaatha

సీబీఐ పనితీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

సీబీఐకి స్వేచ్ఛ అవసరం అని పరోక్షంగా ప్రస్తావించిన సుప్రీంకోర్టు
విధాత,దిల్లీ:కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) పనితీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.సీబీఐ కేసులు కోర్టుల్లో నిలబడే పరిస్థితి లేదని సుప్రీం ఘాటుగా వ్యాఖ్యానించింది.ఇప్పటివరకు ఎన్ని కేసులు చేపట్టారు, ఎన్ని నిరూపించారు అని ప్రశ్నించింది.

ఎందరికి శిక్ష పడింది..?

ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయో చెప్పాలంటూ సీబీఐ డైరెక్టర్‌కు జస్టిస్‌ కౌల్‌, జస్టిస్‌ సుందరేశ్‌ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు లాయర్లు అరెస్టు కేసు విచారణ సందర్భంగా సుప్రీం పైవ్యాఖ్యలు చేసింది.‘ పంజరంలో చిలకకు స్వేచ్ఛ ’ అవసరమని సీబీఐపై గతంలో మద్రాస్‌ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సుప్రీం ప్రస్తావించింది.

Exit mobile version