Site icon vidhaatha

దుస్తుల‌పై నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపే: సుప్రీం

విధాత‌: లైంగిక వేధింపులకు సంబంధించి బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదని గతంలో బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ తీర్పును సవాల్‌ చేస్తూ జాతీయ మహిళా కమిషన్​ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. మహిళల దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వైధింపుల కిందికే వస్తుందని స్పష్టం చేసింది.

Exit mobile version