Gold Ring stolen | న్యూఢిల్లీ : వీళ్లిద్దరిని చూస్తుంటే ఎంతో నైపుణ్యం కలిగిన దొంగల( thieves ) మాదిరి కనిపిస్తున్నారు. ఎందుకంటే వారు చోరీ చేసిన విధానం చూస్తుంటే.. ఇలాంటి దొంగతనాలు ఎన్నో చేసి ఉంటారని అనిపించక తప్పదు. ఓ బంగారు నగల దుకాణం( Gold Shop )లోకి ప్రవేశించిన తల్లీబిడ్డ సెకన్ల వ్యవధిలో గోల్డ్ రింగ్( Gold Ring )ను కొట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీ( Delhi ) నగరంలోని లక్ష్మీనగర్( Lakshmi Nagar )లో రద్దీగా ఉన్న ఓ నగల దుకాణానికి తల్లీబిడ్డ వెళ్లారు. ఇక వారికి బంగారం షాపులో పని చేసే వారు.. గోల్డ్ రింగ్స్‌ను చూపించారు. గోల్డ్ బాక్స్ తెరిచి ముందర పెట్టగానే.. తల్లి ఓ ఉంగరాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. క్షణంలో ఫేక్ ఉంగరాన్ని బాక్సులో పెట్టి ఒరిజినల్ బంగారు ఉంగరాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. అంతే వేగంగా.. పక్కన కూర్చున్న తన బిడ్డకు గోల్డ్ రింగ్‌ను ఇచ్చింది. ఆమె కూడా ఎంతో సులువుగా ఆ ఉంగరాన్ని తన బ్యాగులో వేసుకుంది.
ఇక ఈ బాక్సులో ఉన్న ఉంగరాలు నచ్చలేదని చెప్పడంతో షాపు నిర్వాహకులు మరో బాక్సు వారి ముందు ఉంచారు. బంగారం కొనేందుకు వచ్చినట్లు నటించి.. విలువైన బంగారం ఉంగరాన్ని తల్లీబిడ్డ తస్కరించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజీ ఆధారంగా గోల్డ్ షాపు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీకి పాల్పడ్డ తల్లీబిడ్డ ఆచూకీ కోసం పోలీసులు యత్నిస్తున్నారు.
SHOCKER 🚨 In the blink of an eye, lady thieves swapped a real gold ring with a fake one at a jewellery shop in Delhi’s Laxmi Nagar 🤯
Entire act of swapping ring caught on CCTV 😳pic.twitter.com/A10FHVVzfr
— Times Algebra (@TimesAlgebraIND) October 26, 2025
