Site icon vidhaatha

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న‌ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సతీమణి,కూతురు

విధాత‌: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్పూర్తితో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉషా, కుమార్తె దీపా వెంకట్ బెంగుళూరు దేవనహళ్లి లో సదహళ్లి గేట్ వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమ అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సతీమణి ఉష,కుమార్తె దీపావెంకట్ కు గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సుధీర్ వృక్ష వేదం పుస్తకాన్ని బహుకరించారు.
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్బుతమని ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలని వారు ఆకాక్షించారు..అడవులు,చెట్ల గొప్పతనాన్ని తెలియజేసెలా వృక్ష వేదం పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు.

ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపావెంకట్ తెలిపారు.

Exit mobile version