BRS MLAs disqualification case| ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే మీకు చాలా సమయం ఇచ్చాం అని.. ఇక ఇదే మీకు చివరి అవకాశం అని స్పీకర్ ను ఉద్దేశించి జస్టీస్ సంజయ్ కరోల్, అగస్టీస్ జార్జ్ ల ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నిర్ణయం మీరు తీసుకుంటారా? మేమే నిర్ణయం తీసుకోవాలా? అని నిలదీసింది.

విధాత: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే మీకు చాలా సమయం ఇచ్చాం అని.. ఇక ఇదే మీకు చివరి అవకాశం అని స్పీకర్ ను ఉద్దేశించి జస్టీస్ సంజయ్ కరోల్, అగస్టీస్ జార్జ్ ల ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నిర్ణయం మీరు తీసుకుంటారా? మేమే నిర్ణయం తీసుకోవాలా? అని నిలదీసింది. స్పీకర్ చర్యలు తీసుకోకపోతే మేమే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ తీసుకున్న చర్యలు ఏంటో అఫిడవిట్ ఫైల్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫిరాయింపు ఫిర్యాదులు రాగా వారిలో అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యదయ్యకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వారు పార్టీలు మారారని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంటూ వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణ ముగిసింది. కానీ తీర్పును రిజర్వ్‌లో ఉంచారు.కడియం శ్రీహరి, దానం నాగేందర్ అనర్హత పిటిషన్ల విచారణ పెండింగ్ లో ఉంది.

ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ఇప్పటి వరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో ఏడుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లపై తీసుకున్న చర్యలను సుప్రీంకోర్టుకు నివేదించారు. మిగతా ఎమ్మెల్యేల అనర్హతం అంశంపై కూడా 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించగా.. అభిషేక్ సింఘ్వీ గడువు కోరారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసేందుకు 4 వారాల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఇప్పటికే స్పీకర్‍కు చాలా సమయం ఇచ్చామని ఇఇదే చివరి అవకాశం అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పుడు సకాలంలో నిర్ణయం తీసుకోకుంటే కీలక పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

Latest News