విధాత: ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా ‘జిగ్రిస్’ గురించే చర్చ. చిన్న సినిమాగా మొదలై, సైలెంట్‌గా ఓటీటీలో అడుగుపెట్టిన ఈ చిత్రం. ఇప్పుడు సెన్సేషనల్ హిట్‌గా మారింది. ఈ విజయానికి ప్రధాన కారణం ఒక్కటే అంటే, అది హీరో కృష్ణ బురుగుల అనే చెప్పాలి. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే కనిపించే స్థాయి రెస్పాన్స్, ఇప్పుడు కృష్ణ నటనకు వస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలో కార్తీక్ పాత్రలో ఆయన చేసిన నటనను చూసి “పరకాయ ప్రవేశం” అన్న పదం అక్షరాలా సరిపోతుంది.
ప్రత్యేకంగా ఇంటర్వ్యూ సీన్, గుండెల్ని పిండేసే క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేశాయి. ఆ సీన్స్‌లో కృష్ణ చూపించిన ఎమోషన్స్, ఎక్స్‌ప్రెషన్స్, కళ్లతో మాట్లాడే నటన నిజంగా మంత్రముగ్ధులను చేస్తోంది. బ్రో… నీ యాక్టింగ్ చూశాక నీకు ఫ్యాన్ అయిపోయాం” అంటూ నెటిజన్లు పెడుతున్న కామెంట్స్ చూస్తుంటే, ఆయన ఆడియన్స్ మనసుల్లో ఎంతగా స్థానం సంపాదించుకున్నారో అర్థమవుతుంది.
ఒకప్పుడు ‘కలర్ ఫోటో’ ఓటీటీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో, ఇప్పుడు ‘జిగ్రిస్’తో కృష్ణ బురుగుల అదే మ్యాజిక్‌ను రిపీట్ చేశారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ యంగ్ నటుడి టాలెంట్ చూసి విమర్శకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి బరిలో పెద్ద పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నా, ఇంటి దగ్గర కూర్చుని ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు అంటే.. అది కేవలం బలమైన నటన + మౌత్ పబ్లిసిటీ వల్లే సాధ్యమైంది. ప్రస్తుతం ఈ మూవీ సన్ నెక్ట్స్ , అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో టాప్ 1లో దూసుకెళ్తూ, కృష్ణ బురుగుల క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తోంది. , , ,
