Jigris Movie Review | జిగ్రీస్ మూవీ రివ్యూ : సందీప్ రెడ్డి దోస్తులు నిర్మించిన సినిమా ఎలా ఉందంటే..?

Jigris Movie Review | ప్ర‌తివారం ఎవో ఒక‌టి రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు థియేట‌ర్ల‌కు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలో వారంలో ఏకంగా డ‌జ‌న్‌కు పైగా చిత్రాలు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు ప్రేక్ష‌కులె దుట‌కు వ‌చ్చాయి. వీటిల్లో చెప్పుకోద‌గిన సినిమాలు ఏ ఐదారు ఉండ‌గా అందులో ప్ర‌థ‌మ వ‌రుస‌లో ఉండే చిత్రం జిగ్రీస్ (Jigris).

Jigris Movie Review | ప్ర‌తివారం ఎవో ఒక‌టి రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు థియేట‌ర్ల‌కు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలో వారంలో ఏకంగా డ‌జ‌న్‌కు పైగా చిత్రాలు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు ప్రేక్ష‌కులె దుట‌కు వ‌చ్చాయి. వీటిల్లో చెప్పుకోద‌గిన సినిమాలు ఏ ఐదారు ఉండ‌గా అందులో ప్ర‌థ‌మ వ‌రుస‌లో ఉండే చిత్రం జిగ్రీస్ (Jigris). ప్రముఖ పాన్ ఇండియా టాప్ మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) మిత్రులు ఈ సినిమాను నిర్మించ‌గా సందీప్ సైతం ప్ర‌మోష‌న్‌లో భాగ‌మ‌య్యారు. మ‌రి ఈ చిత్రం శుక్ర‌వారం రిలీజ్ అవుతుండ‌గా ఓ రోజు ముందుగానే ప్రీమియర్స్ వేశారు. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ తెలుసుకోండి.

కథ:

కార్తిక్ (కృష్ణ బూరుగుల), ప్రవీన్ (రామ్ నితిన్), వినయ్ (ధీరజ్ ఆత్రేయ), ప్రశాంత్ (మనీ వాక) అనే నలుగురు స్నేహితులు ఒక రాత్రి బాగా తాగిన‌ మత్తులో ఉన్న‌ప‌లంగా గోవా ట్రిప్‌కి వెళ్లాలని నిర్ణయిస్తారు. అది కూడా మారుతీ 800 కారులో. అలా బయలుదేరిన వారికి మ‌ధ్య‌లో అనేక అనుభ‌వాలు ఎదుర‌వుతాయి. ఓ సారి కారు ట్రబుల్ ఇవ్వ‌డం, అదే స‌మ‌యంలో ఓ ఇంట్రెస్టింగ్ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ కావడంతో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి తిరిగి జ‌ర్నీ స్టార్ట్ చేసిన ఆ మిత్రులు చివరకు గోవా చేరుకున్నారా..? లేదా అసలు కారులోనే ఎందుకు వెళ్లారు. ఆ ప్రయాణం వీరి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింద‌నేది మిగిలిన కథ సారాంశం.

విశ్లేషణ:

‘జిగ్రీస్’ టైటిల్‌కి తగ్గట్టే ఇది నలుగురు జిగ్రీస్‌ కథ. ఇలాంటి సినిమాల్లో కథ కంటే వినోదమే ముఖ్యం. ఆ అంశంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. లారీ సీన్, నాటుకోడి ఎపిసోడ్, కాండోమ్ సీన్‌లు థియేటర్‌లో నవ్వులు పూయిస్తాయి. మావోయిస్టుల బ్లాక్ కూడా ఓ మాదిరిగా ఆకట్టుకుంటుంది. మొత్తం కథలో “మన ఫ్రెండ్స్ కూడా ఇలాగే ఉంటారు కదా” అనిపించే రియలిస్టిక్ వైబ్స్ కనిపిస్తాయి. అయితే చివరి 15 నిమిషాలు మాత్రం ఫుల్ ఎమోష‌న‌ల్‌గా సాగుతూ హృదయాన్ని ట‌చ్ చేస్తాయి.

నటీనటులు – టెక్నికల్ టీమ్:

కృష్ణ బూరుగుల తన ఎనర్జీతో, నేచురల్ నటనతో సినిమాను స్టీల్ చేశాడు. రామ్ నితిన్ సపోర్టివ్ రోల్‌లో బాగా చేశాడు. ధీరజ్ ఆత్రేయ నేచురల్ కామెడీతో మెప్పించాడు. మనీ వాక ప్రధానమైన పాత్రలో కనిపించి కథను నడిపించాడు. ఇక సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్‌గా ఉండి లోకేష‌న్లు ఆక‌ట్టుకుంటాయి. కమ్రాన్ మ్యూజిక్ సినిమాకి బలంగా నిలిచింది. ప్రొడక్షన్ విలువలు కూడా బాగున్నాయి.

ముగింపు:

‘జిగ్రీస్’ కేవలం ఫ్రెండ్స్ ట్రిప్ కాదు.. స్నేహితుల బంధాన్ని, చిన్ననాటి స్మృతులను గుర్తు చేసే ఎమోషనల్ జర్నీ. కామెడీతో మొదలై ఎమోషన్‌తో ముగిసే ఈ సినిమా ఆడియన్స్‌ను కనెక్ట్ చేస్తుంది. అనాటి దోస్తుల‌తో గడిపిన క్షణాలని గుర్తు చేసి ఎమోష‌న‌ల్ ఫీల్ ఇస్తుంది.

రేటింగ్: (3/5) జిగ్రీస్‌.. మెప్పిస్తారు