Prabhas |రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ చిత్రం జనవరి 9న విడుదల కానుండగా, ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్‌లో ప్రభాస్ సందడి నెలకొంది.మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ప్రభాస్ కెరీర్‌లోనే విభిన్నమైన పాత్రగా ఈ సినిమాలో కనిపించనున్నాడనే వార్తలు రావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఇదిలా ఉండగా, న్యూఇయర్ సందర్భంగా అభిమానులకు ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు వంగా ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. గతంలో రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ ఫస్ట్ లుక్‌ను న్యూఇయర్ నైట్ విడుదల చేసి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన వంగా, ఇప్పుడు అదే ప్యాటర్న్‌ను ‘స్పిరిట్’ విషయంలో కూడా ఫాలో అవుతారని సమాచారం. ఈ న్యూఇయర్ నైట్‌కే ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ ఫస్ట్ లుక్‌కు సంబంధించిన షూట్ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. అంతకుముందు విడుదలైన వాయిస్ ప్రోమోకు వచ్చిన భారీ స్పందన సినిమా మీద అంచనాలను మరింత పెంచింది. వంగా మార్క్ ఇంటెన్స్ ప్రెజెంటేషన్‌లో ప్రభాస్‌ను చూపించనున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
‘యానిమల్’ పోస్టర్ ఎలా ఇంటర్నెట్‌ను షేక్ చేసిందో, అదే స్థాయిలో ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ కూడా సోషల్ మీడియాలో భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని ప్రభాస్ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. న్యూఇయర్ నైట్ నిజంగానే ఈ ఫస్ట్ లుక్ విడుదలైతే, కొత్త ఏడాది మొదటి సెన్సేషన్ ‘స్పిరిట్’ కావడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి. గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. మారుతితో రాజా సాబ్.. హను రాఘవపూడి దర్శకత్వంలో “ఫౌజీ” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాలు పూర్తి అయ్యాక సందీప్ రెడ్డితో ‘స్పిరిట్’ చిత్రం చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంతో పాటు నాగ్ అశ్విన్ తో కల్కి – 2 , ప్రశాంత్ నీల్‌తో సలార్ 2.. అలానే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో సినిమాలు చేయనున్నాడు. రానున్న రోజులలో ప్రభాస్ అభిమానులకి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ.
