Viral | Fish | Snake
విధాత: జీవరాశిలో కొన్నింటికి మాత్రమే మానవుడి తరహాలో ఆలోచన.. సమయస్ఫూర్తితో కూడిన తెలివి ఉంటాయని తెలిసిందే. జలచర జీవులైన చేపల్లో డాల్ఫిన్లకు మాత్రమే అలాంటి తెలివి ఉందంటారు. కాని ఈ చేపల ఆహార వేట చూస్తే మాత్రం డాల్ఫిన్ల కంటె తెలివైనవని అనిపించక మానదు. పంచ తంత్రం కథల మాదిరిగా జంతువులు ఆపద సమయాల్లో పరస్పర సహాయం చేసుకున్నట్లుగా ఓ చేపను రక్షించేందుకు మరో చేప చేసిన సహాయం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే నీటిలో ఉన్న సాధారణ చేప ఒడ్డున ఉన్న చెట్టు కొమ్మను చుట్టుకున్న పసిరిక పామును చూసింది. పామును తినాలనుకున్న చేప ఎగిరి దాని తలను నోట బిగించింది. అయితే నీటిలో నుంచి ఎగిరిన చేప తిరిగి నీటిలోకి పడిపోకుండా ఆ పాము మెలికలుగా కొమ్మను చుట్టుకున్న తీరు అడ్డుకుంది. ఇంకేముంది పాము తలను నోటి నుంచి వదలలేక..నీటిలో పడిపోలేక గాల్లోనే ఆ చేప విలవిలలాడుతూ కొట్టుకోసాగింది. ఇదంతా గమనించన మరో చేప ఆ చేపను రక్షించేందుకు చేసిన ఉపాయం విస్మయపరిచింది.
చెట్టుకొమ్మను చుట్టుకున్న పాము తలను నోట కరుచుకుని నీటిలో పడలేక గాల్లోనే విలవిలలాడుతున్న చేప తోకను నీటిలో ఉన్న చేప ఎగిరి నోట పట్టుకుంది. దాంతో రెండు చేపల బరువుకు మొదటి చేప నోటిలోని పాము తల వదిలిపోగా ఆ చేప సురక్షితంగా నీటిలో పడిపోయింది. అటు పసిరక పాము కూడా ప్రాణాలు దక్కించుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పరస్పర సహకారం ఎంత విలువైందో చెప్పడానికి ఈ చేపల కథ ఓ నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు చేపలకు కూడా తెలివి ఉందంటూ కామెంట్ పెట్టారు.