Bird Eats Snake| తన పొడవు పామును మింగేసిన కొంగ..వీడియో వైరల్

ప్రకృతిలో చిన్న పామును పెద్దపాము..చిన్న జంతువులను పెద్ద జంతువులు వేటాడం చూస్తుంటాం. అయితే ఓ కొంగ తన పొడవు ఉన్న పామును అప్పడం మాదిరిగా నమిలేసిన వైనం విస్మయ రేపుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది

విధాత : ప్రకృతిలో చిన్న పామును పెద్దపాము..చిన్న జంతువులను పెద్ద జంతువులు వేటాడం(hunting) చూస్తుంటాం. అయితే ఓ కొంగ(Bird Eats Snake) తన పొడవు ఉన్న పామును అప్పడం మాదిరిగా నమిలేసిన వైనం విస్మయ రేపుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఎక్కువగా ఆఫ్రికా, ఆసియా, ఐరోపా దేశాలలో కనిపించే బూడిద రంగు హెరాన్(Grey Heron Bird) కొంగలు (ఆర్డియా సినీరియా) పెద్దవి 40అంగుళాలు (100సెంటిమీటర్లు) ఎత్తు, బరువు2 కిలోల (2 నుండి 4 పౌండ్ల)వరకు ఉంటూ చేపలు, ఈల్స్, కీటక జీవులు, నీటిలో నివసించే చిన్న పక్షు జాతులను కూడా ఆహారంగా వెటాడుతాయి. పొడవైన రెక్కలు, ముక్కు, కాళ్లతో ఎత్తుగా కనిపిస్తుంది. ఇవి 100నుంచి 500గ్రాముల బరువు ఉన్న వాటిని కూడా సునాయసంగా వేటాడటం వీటి ప్రత్యేకత. సాధారణంగా 57సెంటిమీటర్ల పొడవు వరకు ఉండే ఈల్స్, సముద్ర ట్రాట్ లు, నీటి పాములను వేటాడుతుంటాయి.

అయితే ఓ బూడిదన హెరాన్ కొంగ మాత్రం ఓ నీటి సరస్సులో తన పొడవు ఉన్న నీటి పాము(water snake)ను తన పొడవైన ముక్కుతో వేటాడేసింది(hunting). నిమిషం వ్యవధిలోనే కరకర నమిలేసి మింగేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఒక్కోసారి సముద్రంలో పొడవైన ఈల్స్ ను, చేపలను వేటాడినప్పుడు అక్కడే తినడం వీలుకాకపోతే..ఒడ్డుకు తీసుకవచ్చి వాటిని చీల్చి తినడం చేస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా హెరాన్ కొంగలతో సరీ సృపాలు, చేపలకు, చిన్న నీటి పక్షి జాతులకు భారీ ముప్పు ఉంటున్నప్పటికి ప్రకృతి సర్కిల్ లో అవన్ని ఓ భాగమేనంటున్నారు.

 

Latest News