Viral | గున్న ఏనుగు బుల్లిబుల్లి అడుగులు..క్యూట్ వీడియో చూసేయండి!

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన ఫన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కోతులు, సింహాలు, పులులు, ఏనుగులు, పాండాలు ఇలా అనేక రకాల జంతువులు వాటి హావబావాలతో నవ్వులు పూలు పూయిస్తాయి

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన ఫన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కోతులు, సింహాలు, పులులు, ఏనుగులు, పాండాలు ఇలా అనేక రకాల జంతువులు వాటి హావబావాలతో నవ్వులు పూలు పూయిస్తాయి. ఈ క్రమంలో నెట్టింట్లో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో అప్పుడే పుట్టిన గున్న ఏనుగు బుల్లిబుల్లి అడుగులు వేయడం ముద్దుగొలుపుతోంది. నిలబడి నిలబడలేక పడిపోతున్న ఏనుగు పిల్లకు తల్లి సాయం చేస్తుంది. చివరకు నిలబడిన గున్న ఏనుగు నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోతుంది. చిన్నిచిన్న పాదాలతో ఆ బుల్లి ఏనుగు పిల్ల నడవడం చూస్తుంటే మనసుకు ఎంతో హాయి కలుగుతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.