విధాత: అసలే అడవి గుర్రాలు..మదంతో ఉండే ఆ గుర్రాలు పరస్పరం కలబడితే పచ్చిక బైళ్లు…మైదానాలు ఆగమాగమే. ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా గుర్రాల సంఖ్య అధికంగా ఉండే మంగోలియా, అమెరికా, అర్జెంటినా, కెనడా, బ్రెజిల్, చైనా, అస్ట్రేలియా, కజికిస్తాన్ అడవుల్లో కనిపిస్తుంటాయి. అడవి గుర్రాలు పచ్చిక బైళ్లలో కొడ్లాడితేనే రచ్చగా ఉంటే.. నీళ్లలో కొట్లాడితే మరింత రచ్చరచ్చగా మారుతుంది.
ఓ అడవి గుర్రాల గుంపు నీళ్లు తాగేందుకు సరస్సు లోకి వెళ్లింది. అందులో రెండు గుర్రాలు పరస్పరం కలహించుకుంటూ నీళ్లలోనే ఒకదానిపై మరోకటి దాడి చేసుకుంటు కొట్లాటకు దిగాయి. సరస్సు నీళ్లలోనే అటు ఇటు గంతులేస్తూ ఆవేశంతో దాడిచేసుకున్నాయి. పరస్పరం కరుచుకుంటూ…తన్నుకుంటూ..తరుముకుంటూ పోరాడాయి. కొంత సేపటికి రెండు కూడా అలసిపోయి నీళ్లలోంచి మిగతా గుర్రాలతో పాటు బయటకు వెళ్లిపోయాయి. నీటి సరస్సులో గుర్రాల సమరం వీడియో వైరల్ గా మారింది.
