World’s Biggest Spider Web | ప్రపంచంలోనే అతిపెద్ద సాలెగూడు..వైరల్ వీడియో

అల్బేనియా–గ్రీస్ సరిహద్దులోని గుహలో 1లక్షకి పైగా సాలీళ్లు నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద సాలెగూడు కనుగొన్నారు.

World's biggest spider web

విధాత : అల్బేనియా-గ్రీస్ సరిహద్దులోని సల్ఫర్ గుహలో ప్రపంచంలోనే అతిపెద్ద సాలేగూడును రొమేనియన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 106 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నఈ సాలెగూడును చూసి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. సాధారణంగా పోటీపడే రెండు జాతులకు చెందిన 1లక్ష11,000 కంటే ఎక్కువ సాలెపురుగులు ఉమ్మడిగా ఈ గూడును నిర్మించుకున్నాయని..ఒక ప్రత్యేకమైన, స్వయం సమృద్ధిగల పర్యావరణ వ్యవస్థలో కలిసి జీవిస్తున్నాయని..ఇలాంటిది ఇదే మొదటి సారి అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఇంతపెద్ద స్థాయిలో బహుళ పొరలతో సాలె పురుగులు గూడును నిర్మించడం అరుదైన దృశ్యమని తెలిపారు. సాలెగూడులో దాదాపు 69,000 టెజెనారియా డొమెస్టికా సాలీళ్లు, 42,000 ప్రినెరిగోన్ వాగన్స్ సాలీళ్లు ఉన్నాయని తెలిపారు.