బెదిరింపు రాజకీయాలకు అడ్డ..తెలుగు రాష్ట్రాల రాజకీయం

తెలుగు రాష్ట్రాల్లో అధికారులను బెదిరించడం పరిపాటిగా మారింది. ఏపీలో రెడ్, డిజిటల్ బుక్కుల హల్‌చల్ ఉంటే.. తెలంగాణలో పింక్ బుక్కులతో విపక్షాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

విధాత : మేము వచ్చాక మీ సంగతి చూస్తాం..మీ పేర్లు రాసుకుంటున్నాం అంటూ అధికారులను బెదిరించడం తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు పరిపాటిగా మారింది. పాలనా, రాజ్యాంగ వ్యవస్థలను స్వేచ్ఛగా పనిచేయకుండా ఒత్తిడి తెచ్చే అ ప్రజాస్వామిక ధోరణిలో రాజకీయ పార్టీలు సాగుతున్నాయి. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ రెడ్ బుక్ బెదిరింపులు చేస్తే…వైసీపీ అధినేత జగన్ డిజిటల్ బుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నారు. తొలుత టీడీపీ కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులతో వేధిస్తుందని..జగన్ మేం వచ్చాక టీడీపీ తొత్తులుగా పనిచేస్తున్న అధికారుల సంగతి తేలుస్తామంటూ బెదిరించారు. భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు డిజిటల్ బుక్ యాప్ డేటాను ఆధారంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేపట్టి కూటమి ప్రభుత్వ బాధితులకు న్యాయం చేస్తామని..వేధించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తాజాగా పీపీఏ పద్దతిలో మెడికల్ కాలేజీల నిర్మాణాల అంశంలో మరోసారి అలాంటి బెదిరింపులే చేశారు. ఎవరైనా మెడికల్ కాలేజీల నిర్మాణాలకు టెండర్లు వేస్తే మేం వచ్చాక రద్దు చేస్తామని..జైళ్లో పెడతామని హెచ్చరించడంతో టెండర్ల వ్యవహారం ప్రహసనంగా మారిపోయింది.

తెలంగాణలో బెదిరింపు రాజకీయం

తెలంగాణలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సైతం బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేసిన అధికారుల భరతం పడుతామని, సముద్రాల అవలదాగిన పట్టుకొచ్చి బోనులో నిలబెడుతామంటూ హెచ్చరించారు. ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు వంటి వారి పేర్లను నేరుగా రేవంత్ ప్రస్తావించి హెచ్చరించారు. అధికారంలో వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కు కొమ్ముకాసినట్లుగా వ్యవహరించిన వారిలో కొందరికి అప్రాధాన్యత పోస్టులకు పరిమితం చేస్తున్నారు.

ఇప్పుడు ప్రతిపక్ష నేత కేటీఆర్ , హరీష్ రావులు సైతం రేవంత్ బాటలోనే అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాంగ్రెస్ అనుకూలంగా వ్యవరించే అధికారుల పేర్లను పింక్ బుక్ లో రాస్తున్నామని బెదిరిస్తున్నారు. మేం మళ్లీ అధికారంలోకి వస్తామని..మేం వచ్చాక వారి సంగతి చూస్తామంటు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హిల్ట్ పాలసీలో భూములు కొన్నా..బదలయించుకున్నా..మేము వచ్చాక అన్నిటిని రద్దు చేస్తామని కేటీఆర్ హెచ్చరించడంతో పాలసీ అమలు వివాదస్పదమైంది. ఇక ఫోన్ ట్యాపింగ్ లో నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులను హరీష్ రావు తాజాగా బెదిరించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి :

Panaji Hyderabad Highway | ఆ రహదారి పూర్తయితే పనాజీకి ప్రయాణం ఏడు గంటల్లోనే! 
Chiranjeevi | ఇంట్లోనూ మెగాస్టారే.. భార్యకు వంట నేర్పించిన చిరంజీవి – ‘చిరు దోస’ కథ ఇదే!

Latest News