Scooty | స్కూటీ ముందు భాగంలో పిల్లల్ని నిల్చోబెడుతున్నారా.. ? త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. వీడియో చూడండి

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ముజఫర్‌నగర్ (Muzaffarnagar)లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ మ‌హిళ త‌న పిల్ల‌ల్ని స్కూల్ నుంచి స్కూటీలో ఇంటికి తీసుకెళ్తోంది. ఈ క్ర‌మంలో ఓ చోట స్కూటీని ఆప‌గా.. అది అదుపుత‌ప్పి ముందు ఉన్న గోడ‌ను బ‌లంగా ఢీ కొట్టింది.

Scooty | సాధార‌ణంగా స్కూటీలో వెళ్లేట‌ప్పుడు చాలా మంది త‌మ పిల్ల‌ల్ని ముందు నిల్చోబెట్టుకుంటారు. వెనుక ప్లేస్ స‌రిపోద‌నో, లేక చిన్న‌పిల్లాడు నిద్ర‌పోతే ప‌డిపోతాడనే భ‌యంతో ముందు నిల్చోబెట్టుకుని వెళ్తుంటారు. అయితే, అలా చేయ‌డం చాలా ప్ర‌మాదం. ఒక్కోసారి పిల్ల‌లు కింద‌కు దిగే క్ర‌మంలో యాక్సిల‌రేట‌ర్ (Accelerator) లాగితే అంతే సంగ‌తులు. స్కూటీ మ‌న కంట్రోల్ దాటి ముందుకు దూసుకెళ్లిపోతుంది. మ‌నం తేరుకునేలోపే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రుగుతుంది. ఇందుకు ఉదాహ‌ర‌ణే ఈ వీడియో.

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ముజఫర్‌నగర్ (Muzaffarnagar)లో ఓ మ‌హిళ త‌న పిల్ల‌ల్ని స్కూల్ నుంచి స్కూటీలో ఇంటికి తీసుకెళ్తోంది. ఆ స‌మ‌యంలో ఆమె ఇద్ద‌రు పిల్ల‌ల్ని వెనుక కూర్చోబెట్టుకొని ఓ పిల్లాడిని మాత్రం ముందు నిల్చోబెట్టుకుంది. ఓ చోట స్కూటీ ఆప‌గా.. వెనుక కూర్చున్న చిన్నారి దిగేందుకు ప్ర‌య‌త్నించింది. పాప‌కు సాయం చేసేందుకు ఆ మ‌హిళ చేయి ప‌ట్టుకుంది. అంతే ఇంత‌లో ముందు నిల్చున్న పిల్లాడు కింద‌కు దిగిపోయాడు. ఆ స‌మయంలో యాక్సిల‌రేట‌ర్‌ను లాగాడు.. అంతే స్కూటీ అమాంతం చిన్నారిని ఈడ్చుకుంటూ ముందుకు దూసుకెళ్లి ఓ గోడ‌ను బ‌లంగా ఢీ కొట్టింది.

మీ భ‌ద్ర‌త మీ చేతుల్లోనే..

అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు వెంట‌నే వారికి సాయం చేశారు. అదృష్ట‌వ‌శాత్తూ ఈ ప్ర‌మాదంలో పిల్ల‌లు, ఆ మ‌హిళ స్వ‌ల్ప గాయాల‌తోనే బ‌య‌ట‌ప‌డ్డారు. సివిల్ లైన్స్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఆనంద్‌పురి ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృష్యాలు అక్క‌డే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ‌య్యాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన నెటిజ‌న్లు ఒక్క‌సారిగా షాక్ అవుతున్నారు. పిల్ల‌ల్ని స్కూటీల్లో తీసుకెళ్లేట‌ప్పుడు జాగ్ర‌త్త‌లు వ‌హించాలంటూ సూచిస్తున్నారు. మ‌రోవైపు ఈ వీడియోపై హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ స్పందించారు. ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేస్తూ.. ‘మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది.. గమనించండి’ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు.

 

ఇవి కూడా చదవండి :

Sreeleela | బ్యూటీ విత్ బ్రెయిన్ .. ఎంబీబీఎస్ పూర్తి చేసి అధికారికంగా డాక్టర్‌గా మారిన క్రేజీ హీరోయిన్
Abhishek Sharma Hospitalised | ఆస్పత్రిలో చేరిన అభిషేక్ శర్మ.. నమీబియా మ్యాచ్‌కు దూరం!

Latest News