Allu Aravind: అల్లు అరవింద్.. అవేదన అందుకేనా! టాలీవుడ్‌లో చర్చ

తాజాగా సైమా అవార్డుల వేదికగా తెలుగు భారీ నిర్మాత, అల్లు అర్జున్ (Allu Arjun) తండ్రి అల్లు అరవింద్ (Allu Aravind) చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద రచ్చనే చేస్తున్నాయి. సెప్టెంబరు 5, 6 తేదీల్లో సైమా అవార్డ్స్ (SIIMA 2025) 2025 వేడుకలు దుబాయ్‌లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ అవార్డు (National Awards) విన్నర్స్‌ను ‘సైమా’ సత్కరించింది.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ దఫా జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాలకు ఏడు ఆవా ర్డులొచ్చాయి. అయినా మన తెలుగు సినీ పరిశ్రమ స్పందించలేదు. టాలీవుడ్‌లో ఎవరి కుంపటి వారిదే పట్టింపు ఉండదు అనేలో అర్థం వచ్చేలా షాకింగ్ కామెంట్లు చేశారు. కానీ ఇప్పుడు సైమా నిర్వాహకులు స్పందించి, విజేతలను సత్కరించడం అభినందనీయమని అన్నారు. నిజానికి దీనిని ఒక పండగలా జరుపుకోవాలి. ‘సైమా’ దీన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నా అని అన్నారు.
అయితే ఇప్పుడు అల్లు అరవింద్ వ్యాఖ్యల వెనుక బలమైన కారణమే ఉందంటూ టాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పడిన తర్వాత జాతీయ అవార్డులు ప్రారంభించినప్పటి నుంచి సుమారు ఐదారు దశాబ్దాలుగా ఓ తెలుగు నటుడికి అందని ద్రాక్షలానే మిగిలిపోయిన విషయం తెలిసిందే. చివరకు రెండేండ్ల క్రితం పుష్ప సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు సాధించి తెలుగు వారి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేశాడు. అంతేగాక మరో 9 అవార్డులు సైతం వచ్చాయి.
ఈక్రమంలో ఆ విషయాన్ని మరిచిన ఇక్కడి సినీ పెద్దలు, పరిశ్రమ సదరు హీరోకు ఎలాంటి సత్కారం చేయక పోగా అంతగా అభినందనలు తెలిపిన వారు కూడా అరుదే. ఇప్పుడు ఈ విషయాన్ని మనసులో ఉంచుకునే అల్లు అరవంద్ ఇప్పుడు ఎవరి కుంపటి వారితే అనే కామెంట్లు చేసినట్లు అనుకుంటున్నారు. మరి చూడాలి ఇప్పటికైనా టాలీవుడ్ ఏమైనా స్పందించి జాతీయ అవార్డు గ్రహాతలకు సన్మానం చేస్తారో లేదో.