Site icon vidhaatha

Vijayawada | లోన్ యాప్ వేదింపులకు యువకుడు బలి

విధాత : ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విజయవాడ విద్యార్థి మురికింటి వంశీ అనే యువకుడు లోన్ యాప్‌ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.10,000 అప్పుగా తీసుకుంటే, లోన్ యాప్ సిబ్బంది వంశీని 1 లక్ష రూపాయలు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేసి వేధించారు. ఈ వేధింపులు తట్టుకోలేక, ఇంట్లో చెప్పుకోలేక భయపడి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

విజయవాడలో లోన్‌ యాప్‌ల ఆగడాలను అరికట్టడంలో పోలీసులు విఫలమవుతుండటంతో ఈ తరహా వేధింపులు అధికమవుతున్నాయి. బాధితులు వేధింపులు తాళలేక ఆత్మహత్యల పాలవుతున్నా ఈ వ్యవహారంపై పోలీసులు సీరియస్‌గా చర్యలు తీసుకోలేకపోతుండటం విమర్శలకు గురవుతుంది.

Exit mobile version