విధాత: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏపీ హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది.హైకోర్టు తీర్పు కాపీని పరిశీలించి లెక్కింపు తేదీలపై నిర్ణయం తీసుకోనుంది.
ఎన్నికల లెక్కింపునకు చేయాల్సిన ఏర్పాట్లు, తదితర అంశాలపై చర్చించేందుకు సీఎస్, డీజీపీతో ఎస్‌ఈసీ నీలం సాహ్ని సమావేశం కానున్నారు. లెక్కింపునకు సిబ్బంది ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై ఆ సమావేశంలో చర్చింనున్నారు..