AP Assembly | ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక

AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 26 వరకు మూడు రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్‌ ఎన్నిక, కొత్త సభ్యుల ప్రమాణస్వీకారాలు, స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక జరగనున్నాయి. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది.

  • Publish Date - June 18, 2024 / 10:25 AM IST

AP Assembly : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 26 వరకు మూడు రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్‌ ఎన్నిక, కొత్త సభ్యుల ప్రమాణస్వీకారాలు, స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక జరగనున్నాయి. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది.

దాంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. టీడీపీకి సొంత మెజారిటీ దక్కినప్పటికీ జనసేన, బీజేపీ కూడా ప్రభుత్వంలో భాగమయ్యాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారాలు చేశారు. ఇక నూతన అసెంబ్లీ కొలువుదీరడమే తరువాయిగా ఉన్నది. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సమావేశాలు ప్రారంభం కాగానే తొలుత ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ఆయన నూతనగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సభ్యుల ప్రమాణస్వీకారాలు పూర్తయిన తర్వాత స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరుగుతుంది. నిజానికి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19 ననే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ గవర్నర్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సెలవుల్లో ఉండటంతో ఈ నెల 24వ తేదీకి వాయిదాపడ్డాయి. స్పీకర్‌ పదవి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేన పార్టీకి ఇస్తారనే టాక్‌ వినిపిస్తోంది.

Latest News