అమరావతి : బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. దాదాపుగా 200 సీట్లతో ఎన్డీయే గెలవబోతుండటం హర్షణీయమన్నారు. ఎన్నికల ఫలితాలు చూస్తే ప్రజలంగా ప్రధాని నరేంద్ర మోదీ వైపు ఉన్నారని అర్థం అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇంతలా ప్రజా నమ్మకం సాధించిన వ్యక్తి మోదీ తప్పా మరెవరు లేరు అన్నారు. 20వ శతాబ్ధం నరేంద్ర మోదీదే అని మరోసారి చెప్పదల్చుకున్నానని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మొత్తం 243స్థానాల్లో ఇప్పటికే వెలువడిన ఫలితాల మేరకు 187స్థానాల్లో ఆధిక్యత కొనసాగుతుంది.
