Manchu Manoj | చంద్రబాబుతో.. మంచు మనోజ్‌ భేటీ

Manchu Manoj | పొలిటికల్‌ ఎంట్రీ ఫిక్స్‌ అయినట్లేనా! విధాత: తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మోహన్‌బాబు కుమారుడు యువ హీరో మంచు మనోజ్‌ ఆయన సతీమణి భూమా మౌనికా రెడ్డి దంపతులు భేటీ కావడం రాజకీయ, సినీ వర్గాలలో చర్చనీయాంశమైంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి వెళ్లిన మనోజ్‌ దంపతులు సుమారుగా ఆరగంటకుపైగా సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మనోజ్‌ అన్ని అనుకున్నట్లుగా జరిగితే అతి త్వరలో రాజకీయాల్లోకి […]

  • Publish Date - July 31, 2023 / 04:58 PM IST

Manchu Manoj |

పొలిటికల్‌ ఎంట్రీ ఫిక్స్‌ అయినట్లేనా!

విధాత: తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మోహన్‌బాబు కుమారుడు యువ హీరో మంచు మనోజ్‌ ఆయన సతీమణి భూమా మౌనికా రెడ్డి దంపతులు భేటీ కావడం రాజకీయ, సినీ వర్గాలలో చర్చనీయాంశమైంది.

సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి వెళ్లిన మనోజ్‌ దంపతులు సుమారుగా ఆరగంటకుపైగా సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మనోజ్‌ అన్ని అనుకున్నట్లుగా జరిగితే అతి త్వరలో రాజకీయాల్లోకి ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటానని మీడియాకు చెప్పారు.

మనోజ్‌ దంపతులు పెళ్లి అయిన తరువాత మొదటి సారిగా చంద్రబాబును కలువడానికి వచ్చామని, మంగళవారం మా బాబు పుట్టిన రోజు ఉందని, ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చామని తెలిపారు.

అలాగే రాజకీయాలలోకి ప్రవేశంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తామని మనోజ్‌ దంపతులు చెప్పారు. అయితే టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్న తరువాతనే మనోజ్‌ దంపతులు చంద్రబాబును కలిశారన్నర చర్చ సోషల్‌ మీడియాలో జరుగుతోంది.

Latest News