Site icon vidhaatha

చిరంజీవి కాంగ్రెస్ వాదే…

విధాత‌,విజయవాడ:చిరంజీవి కాంగ్రెస్ వాదేనని ఎఐసిసి, ఎపిసిసి స్పష్టీకరణ చేసింది.నిన్న ఉమెన్ చాందీ చిరంజీవి కాంగ్రెస్ వాది కాదు అనడంపై ఎపిసిసి అధ్యక్షుడు సాకే శైలజానాధ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి కాంగ్రెస్ వాదేన‌ని నిన్న ఎపిసీసి వ్యవహారాల ఇన్ చార్జి ఉమెన్ చాందీ కేవలం చిరంజివి తనకిష్టమైన సినీ రంగంలో బిజీగా ఉండడం వల్లనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెప్పారు.

చిరంజీవి కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు, పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు.చిరంజీవి, ఆయన కుటుంబం మొదట నుంచి కాంగ్రెస్ వాదులు, చిరంజీవి కాంగ్రెస్ వాది కాదు అని వార్తలు రాయడం దారుణం,భవిష్యత్తులో చిరంజీవి సేవలు పార్టీకి అందుతాయి..ఆయన క్రియాశీలకంగా పాల్గొనే అవకాశం ఉంది అని శైల‌జానాధ్ అన్నారు.

Exit mobile version