విధాత, హైదరాబాద్ : డీసీసీ అధ్యక్షుల ఎంపికకు సంబంధించి ఏఐసీసీ పలు నిబంధనలు తెరపైకి తెచ్చింది. డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తులు చేసుకునేవారు ఐదేళ్లపాటు పార్టీలో కొనసాగి ఉండాలని..ఇప్పటికే పనిచేసిన డీసీసీ అధ్యక్షులకు రెండోసారి అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధుల బంధువులకు కూడా డీసీసీ అధ్యక్ష పదవికి అవకాశం లేదని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ నాయకులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్న ఏఐసీసీ ప్రతినిధులతో ఆశావహులు ఎవరు కూడా వ్యక్తిగత సంభాషణలు, సమావేశాలు పెట్టవద్ధని హెచ్చరించారు. డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకులు ఆదివారం నుంచి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఏఐసీసీ పరిశీలకులలో మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి, కేంద్ర మాజీ మంత్రి సీపీ జోషి, సీడబ్ల్యుసీ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు వంటి సీనియర్ నేతలు ఉన్నారు. వారు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ డీసీసీ అధ్యక్షుల ఎంపికపై స్పందిస్తూ సమర్థవంతమైన నాయకులు..
డీసీసీ అధ్యక్షులుగా ఎంపికయ్యే అవకాశం ఉందన్నారు. ఏఐసీసీ నాయకత్వం డీసీసీ అధ్యక్షులు ఎంపికలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. రాబోయో అసెంబ్లీ,పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో వీరు ప్రధాన భూమిక పోషించే అవకాశం ఉందన్నారు.