Site icon vidhaatha

NSUI leader | సత్యసాయి జిల్లాలో దారుణం.. ఎన్‌ఎస్‌యూఐ నేత దారుణ హత్య

విధాత : శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురానికి చెందిన కాంగ్రెస్ విద్యార్థి విభాగం(ఎన్ఎస్‌యూఐ) జాతీయ కార్యదర్శి, యువ న్యాయవాది సంపత్‌కుమార్ రాజు దారుణ హత్యకు గురయ్యారు. ధర్మవరం చెరువు ప్రాంతంలో గురువారం అతని మృతదేహం లభ్యమైంది. హత్యకు గల కారణాలు అన్వేషిస్తున్న ధర్మవరం పోలీసులు.

సంపత్ రాజును కొడవళ్లతో నరికి చంపారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంపత్‌రాజు హత్యకు భూ తగాదాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సంపత్‌రాజు ఆయనతో కలిసి నడిచాడు.

Exit mobile version