వైసీపీ మంత్రి, ఎమ్మెల్యేలపై కేసు నమోదు

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలు పోలింగ్ మరుసటి రోజు కూడా అక్కడక్కడా కొనసాగుతున్నాయి. పోలీసు బలగాలు ఎన్నికల అనంతర ఘర్షణలను నివారించేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • Publish Date - May 14, 2024 / 05:04 PM IST

కొనసాగుతున్న ఘర్షణలు

విధాత : ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలు పోలింగ్ మరుసటి రోజు కూడా అక్కడక్కడా కొనసాగుతున్నాయి. పోలీసు బలగాలు ఎన్నికల అనంతర ఘర్షణలను నివారించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పోలింగ్ సందర్భంగా తెనాలి పోలింగ్ కేంద్రంలో క్యూలైనల్‌లో రావాలని కోరిన ఓటర్ గొట్టుముక్కల సుధాకర్ పై దాడి చేసిన తెనాలి సిటింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుల శివకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదు మేరకు ఎస్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్యేతోపాటు మరో ఏడుగురు తనపై దాడి చేసినట్లు సుధాకర్ తన ఫిర్యాదులో పేర్కొనడంపై వారిపై కేసు నమోదు చేశారు.

మరోవైపు మంత్రి, డోన్ వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాధ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పోలింగ్ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థి పీఎన్ బాబ కారుపై బుగ్గన అనుచరులు దాడికి పాల్పడ్డారు. తనను కులం పేరుతో దూషించి ఇనుపరాడ్డులతో కారు అద్దాలను పగులగొట్టారని పీఎన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుగ్గనతో పాటు నగర పంచాయతీ చైర్మన్ చలంరెడ్డి, నాయకులు నాగరాజు, నాగేశ్వరరావు, మరో 30 మంది బుగ్గన అనుచరులపై బేతంచర్ల పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అలాగే మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామరెడ్డిపైన కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పోలింగ్ సందర్భంగా చాపాడు మండలం చిన్నగులవలూరులో ఇద్దరు టీడీపీ ఏజెంట్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. బాధితుల పిర్యాదు మేరకు ఎమ్మెల్యే సహా 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Latest News