విధాత హైదరాబాద్ : ఏపీలో తన అభిమాన నేత నారా చంద్రబాబునాయుడు సీఎం కావాలని ఆయన వీరాభిమాని ఏకంగా తన నాలుక కోసుకుని కలకలం సృష్టించాడు. హైదరాబాద్ బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలో ఈరోజు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చెవల మహేశ్ ఏపీకి మరోసారి చంద్రబాబు సీఎం కావాలని తన నాలుక కోసుకుని మొక్కు తీర్చుకున్నాడు.
అదే విషయాన్ని అతను రాసిన లేఖలో వెల్లడించాడు. గతంలోనూ రెండు సార్లు తాను ఇలాగే నాలుక కోసుకున్నట్లు లేఖలో తెలిపాడు. సమాచారం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అశోక్ ను చికిత్స నిమిత్తం శ్రీనగర్ కాలనీ ‘నిఖిల్‘ హాస్పిటల్‌కి తరలించారు.