రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్న సీఎం జగన్

ఉండవల్లి కరకట్ట విస్తరణకు రేపు శంకుస్థాపనపాల్గొంటున్న సీఎం జగన్ కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద భూమిపూజరూ.150 కోట్ల వ్యయంతో పనులువిధాత :అమరావతిలో రేపు సీఎం జగన్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు.ఉండవల్లి కరకట్ట విస్తరణ పనులకు సీఎం జగన్ భూమిపూజ చేయనున్నారు. కరకట్ట విస్తరణ పనులకు కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద శంకుస్థాపన చేస్తారు. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా ఉండవల్లి కరకట్ట నుంచి వైకుంఠపురం వరకు 15 కిలోమీటర్ల రోడ్డును విస్తరించనున్నారు. ఇందుకోసం […]

  • Publish Date - May 20, 2021 / 10:41 AM IST

ఉండవల్లి కరకట్ట విస్తరణకు రేపు శంకుస్థాపన
పాల్గొంటున్న సీఎం జగన్
కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద భూమిపూజ
రూ.150 కోట్ల వ్యయంతో పనులు

విధాత :అమరావతిలో రేపు సీఎం జగన్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు.ఉండవల్లి కరకట్ట విస్తరణ పనులకు సీఎం జగన్ భూమిపూజ చేయనున్నారు. కరకట్ట విస్తరణ పనులకు కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద శంకుస్థాపన చేస్తారు. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా ఉండవల్లి కరకట్ట నుంచి వైకుంఠపురం వరకు 15 కిలోమీటర్ల రోడ్డును విస్తరించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.150 కోట్లు ఖర్చు చేయనుంది. రేపు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా, సమావేశాలకు వెళ్లే ముందు సీఎం ఈ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారని నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ఈ రోడ్డు విస్తరించడం వల్ల ఇబ్రహీంపట్నం, వెంకటపాలెం మధ్య నిర్మించే ఐకాన్ బ్రిడ్జి, కాజ టోల్ గేట్ నుంచి వెంకటపాలెం వరకు నిర్మించ తలపెట్టిన బైపాస్ రోడ్ అనుసంధానానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు