విధాత:కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకు పోవడం ఆందోళనకు గురి చేస్తున్నది. ఇది గేటు అమరికలో పొరపాటు కారణమా? లేక మొత్తం డ్యామ్ నిర్మాణమే తక్కువ నాణ్యతతో కట్టబడిందా? వంటి సందేహాలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కృష్ణా డెల్టా స్థిరీకరణ కోసం, విద్యుత్ ఉత్పత్తి కోసం ఉద్దేశించబడిన ఈ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంలోనే పలు అవకతవకలు జరిగినట్టు గతంలోనే ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పుడు గేటు వూడిపోవడంతో డ్యామ్ నాణ్యతపై పలు అనుమానాలకు ఆస్కారం ఏర్పడిరది. ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయానికి ఉపయోగపడాల్సిన విలువైన నీరు సముద్రంలో కలిసిపోతున్నది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిపుణులతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది. అలాగే డ్యాము భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.