అందుకే వైసీపీకీ రాజీనామా చేశా.. అంబటి రాయుడు స్పష్టీకరణ

ఇటీవల వైసీపీలో చేరి వెంటనే రాజీనామా చేసిన క్రికెటర్ అంబటి రాయుడు తన రాజీనామాకు సంబంధించి ట్వీట్టర్ వేదికగా ఆదివారం స్పష్టతనిచ్చారు

  • Publish Date - January 7, 2024 / 12:32 PM IST

విధాత : ఇటీవల వైసీపీలో చేరి వెంటనే రాజీనామా చేసిన క్రికెటర్ అంబటి రాయుడు తన రాజీనామాకు సంబంధించి ట్వీట్టర్ వేదికగా ఆదివారం స్పష్టతనిచ్చారు. జనవరి 20 నుంచి దుబాయిలో జరగనున్న ఇంటర్నేషనల్ టీ-20(ఐఎల్ టీ-2) టోర్నీలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించటానికి నేను రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని అయ్యుండాలని, అందుకే రాజకీయాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వడం జరిగిందని ట్వీట్‌లో పేర్కోన్నారు. డిసెంబర్ 28న వైసీపీలో చేరిన అంబటి రాయుడు ఆ వారం తిరగకముందే పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆయన కోరిన ఎంపీ సీటు టికెట్ వైసీపీ నిరాకరించడంతో అసంతృప్తితో ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లుగా భావించారు. అయితే క్రికెట్ కారణాలతోనే తాను రాజకీయాల నుంచి వైదొలగినట్లుగా అంబటి రాయుడు స్వయంగా పేర్కోనడంతో రాజీనామా విషయంలో గందరగోళం తొలగినట్లయ్యింది.