Site icon vidhaatha

Divvela Madhuri | రోడ్డు ప్రమాదంలో దివ్వెల మాధురికి తీవ్ర గాయాలు

దువ్వాడ వాణి వేధింపులు తాళలేక ఆత్మహత్య యత్నం
నేను చనిపోవాలనుకున్నా..చికిత్స వద్దన్న మాధురి

విధాత, హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో సంబంధాల నేపథ్యంలో ఆయన భార్య వాణితో విమర్శలకు గురవుతున్న దివ్వెల మాధురి ఆత్మహత్య యత్నం చేసుకుంది. టెక్కలి నుంచి పలాస మార్గంలో వెలుతున్న మాధురి తన కారును ఆగివున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ఏయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడం.. సీటు బెల్టు పెట్టుకుని ఉండటంతో స్వల్ప గాయాలతో బయటపడిన మాధురిని పలాస ఆసుపత్రికి తరలించారు. అయితే తాను చనిపోవాలనుకునే కారు ప్రమాదానికి పాల్పడ్డానని, దువ్వాడ వాణి తనను, తన బిడ్డలను విపరీతంగా ట్రోల్ చేస్తూ వేధిస్తుందని, వాణి వేధింపులను భరించలేకనే ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నానని వైద్యులకు తెలిపింది. తనకు బతుకలాలని లేదని, ఎలాంటి చికిత్స అవసరం లేదని, తాను చనిపోతానని మాధురి చికిత్సకు నిరాకరించారు. దువ్వాడ వాణి తనను ట్రోల్ చేసిన భరించేదానినని, అయితే తన పిల్లలను ట్రోల్ చేయడం నన్ను బాధించిందని, నా పిల్లలు నన్ను తమకు డీఎన్‌ఏ పరీక్ష ఎందుకు చేయాలంటూ ప్రశ్నించడంతో తట్టుకోలేకపోయానని మాధూరి కన్నీరు పెట్టుకుంది. తాను చనిపోతే తన చావుకు దువ్వాడ వాణి కారణమని పేర్కోంది. దివ్వెల మాధురి కారు ప్రమాదంతో ఆత్మహత్య యత్నం చేసుకున్న సమయంలో దువ్వాడ వాణి, తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఇంటి వద్ద ధర్నా కొనసాగిస్తున్నారు.

Exit mobile version