AP Waiting List IPSs Report at Head Quarter | ఏపీలో వెయిటింగ్ జాబితాలో ఉన్న ఐపీఎస్ అధికారులు(IPS Officers in waiting list) రోజూ హెడ్ క్వార్టర్‌లో రిపోర్టు చేయాలని డీజీపీ ద్వారక తిరుమలరావు(Dwaraka Tirumala Rao) ఆదేశించారు. వెయిటింగ్ జాబితాలో ఉంటూ అందుబాటులో ఉండని సీనియర్ ఐపీఎస్‌కు డీజీపీ మెమోలు జారీ చేశారు. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న డీజీ ర్యాంకు అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, సునీల్ కుమార్ సహా 16 మంది ఐపీఎస్ అధికారులకు మెమో జారీ అయ్యాయి. వెయిటింగ్ లో సీఐడీ మాజీ చీఫ్ సంజయ్(Former CID chief Sanjay), విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా టాటా, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని, రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరా రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణ కాంత్ పటేల్, పాలరాజులకు డీజీపీ మెమో జారీ చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని(Stay in the DGP office from 10 am to evening) ఆదేశించారు. విధులు ముగిశాక అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లాలని డీజీపీ స్పష్టం చేశారు. కాగా డీజీపీ ఆదేశాలపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు(JC Prabhakar Reddy made sensational comments on DGP’s orders). గత ఐదేళ్లల్లో చాలా దారుణాలు జరిగాయని, ఎంతో మందిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. ఇప్పుడు ఐపీఎస్ ల పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందని, మేం కేసుల్లో ఉంటే షరతులతో కూడిన బెయిల్ మేరకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిత్యం సంతకాలు పెట్టినట్లుగా మీరు కూడా డీజీపీ ఆఫీస్‌లో రిపోర్టు చేయడం బాధకరమన్నారు. డీజీపీ మీకు కండిషన్ బెయిల్ ఇచ్చినట్లుగా ఉందన్నారు. మేమైనా సంతకం పెట్టి ఇంటికి పోతామని, మీరు గెస్ట్‌రూమ్‌లు సాయంత్రం వరకు కూర్చోవాల్సివుంటుందని మీకంటే మాదే గౌరవంగా ఉందన్నారు. ఐపీఎస్, ఐఏఎస్‌లకు ఇలాంటి పరిస్థితి రావద్దని, వదిలేసి వారిని వీఆర్‌లో పెట్టండన్నారు. ఇకనైనా గతంలో వ్యవహరించినట్లు దయచేసి వ్యవహరించొద్దని, మారాలని కోరారు.
AP Waiting List IPSs Report at Head Quarter | డీజీపీ ఆఫీసులో రోజూ రిపోర్టు చేయండి.. వెయిటింగ్ ఐపీఎస్‌లకు ఏపీ డీజీపీ ఆదేశాలు
